FIGHTER Vs TOXIC: ఫైటర్ మూవీని మింగేసిన కన్నడ మూవీ టాక్సిక్

ఈ మూవీ మోషన్ పోస్టర్ వచ్చే రోజే మరో సినిమా టీజర్ వచ్చింది. దాన్ని టాక్సిక్ సినిమా మోషన్ పోస్టర్ పూర్తిగా మింగేసింది. బాలీవుడ్ గ్రీక్ గాడ్, హృతిక్ రోషన్‌తో సిద్దార్ధ్ అనంద్ తీసిన మూవీ ఫైటర్. ఈ సినిమా టీజర్ వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 8, 2023 | 07:32 PMLast Updated on: Dec 08, 2023 | 7:32 PM

Fighter Vs Toxic Yash Movie First Look Dominated Hrithik Roshans Fighter

FIGHTER Vs TOXIC: కేజీయఫ్ ఫేం రాకీ భాయ్ కొత్త సినిమా ఎప్పుడు..? ఎవరితో అన్న ప్రశ్నలకు టైటిల్ ఎనౌన్స్‌మెంట్‌తో ఇప్పటికి ఆన్సర్ దొరికింది. అది కూడా అఫీషియల్‌గా సమాధానం వచ్చేైసింది. ఏదేమైనా ఈ టాక్సిక్ మూవీ చిమ్మించిన విషానికి హిందీ హీరో హృతిక్ సినిమా బెడ్డెక్కింది. మనిషిని పాము కాటేస్తే విరుగుడు ఇవ్వాల్సిందే. లేదంటే ఫోటోకి దండ పడిపోతుంది.

ANIMAL: యానిమల్, టాక్సిక్.. టైటిల్స్ ట్రెండ్ మారిందా?

ఒక విషపు పాము కాటేస్తేనే ఇలా జరిగితే.. అదే ఒళ్లంతా విషంతోనిండే మనిషి కాటేస్తే ఏంటి పరిస్థితి.. ఆ పాయింట్‌తోనే రాకింగ్ స్టార్ యష్ మూవీ టాక్సిక్ రాబోతోంది. ఒళ్లంతా విషమే, తను దండెత్తితే చిమ్మేది విషమే అన్న మీనింగ్ వచ్చేలా టైటిల్ పోస్టర్‌ని వదిలింది గీతూ మోహన్ టీం. అంతవరకు ఓకే.. కానీ ఈ మూవీ మోషన్ పోస్టర్ వచ్చే రోజే మరో సినిమా టీజర్ వచ్చింది. దాన్ని టాక్సిక్ సినిమా మోషన్ పోస్టర్ పూర్తిగా మింగేసింది. బాలీవుడ్ గ్రీక్ గాడ్, హృతిక్ రోషన్‌తో సిద్దార్ధ్ అనంద్ తీసిన మూవీ ఫైటర్. ఈ సినిమా టీజర్ వచ్చింది.

నిమిషం పైనే ఉన్న ఈ టీజర్‌ని పట్టించుకున్న నాధుడేలేడు. కానీ, విజువల్స్ లేకుండా కేవలం మోషన్ పోస్టర్ రూపంలో.. అది కూడా కొన్ని సెకన్ల నిడివితో వచ్చిన టాక్సిక్ మాత్రం అందరి అటెన్షన్ లాక్కుంటోంది. అలా ఫైటర్‌ని టాక్సిక్ మింగేసిందంటున్నారు ఫిలిం అనలటిక్స్.