మోహన్ బాబు ఫ్యామిలీలో భంభోళ జంభ… ఆస్తుల కోసం తండ్రి కొడుకుల మధ్య కొట్లాట,
మంచు కుటుంబంలో అగ్గి రేగిందా...? గత కొన్నేళ్లుగా కరుగుతున్న మంచు ఇప్పుడు పెట్రోల్ గా మారిందా...? మోహన్ బాబు పేరుకే పెదరాయుడా...? తన బిడ్డల గురించి గొప్పగా మాట్లాడే మోహన్ బాబు... ఆస్తుల కోసం ఇంటి రౌడీగా మారారా...? అంటే అవుననే సమాధానం వస్తోంది.
మంచు కుటుంబంలో అగ్గి రేగిందా…? గత కొన్నేళ్లుగా కరుగుతున్న మంచు ఇప్పుడు పెట్రోల్ గా మారిందా…? మోహన్ బాబు పేరుకే పెదరాయుడా…? తన బిడ్డల గురించి గొప్పగా మాట్లాడే మోహన్ బాబు… ఆస్తుల కోసం ఇంటి రౌడీగా మారారా…? అంటే అవుననే సమాధానం వస్తోంది. మంచు ఫ్యామిలీలో కార్చిచ్చు ఎప్పుడో రేగినా… ఆ సెగలు బయటకు తగులుతున్నా ఏదో కవరింగ్ అయితే చేస్తూ వచ్చారు. ముఖ్యంగా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ కేంద్రంగా ఈ యుద్ధం జరుగుతోంది.
మంచు విష్ణు… తనను దూరం పెట్టడం, స్కూల్ మొత్తం తానే లాక్కోవాలి అని చూడటం పట్ల మంచు మనోజ్ ఆగ్రహంగా ఉన్నాడని టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంటుంది. ఈ విషయంలో గతంలో మనోజ్, విష్ణు మధ్య గొడవలు కూడా అయ్యాయని ఇద్దరూ కొట్టుకున్నారని కూడా అంటారు. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా తర్వాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఇది తీవ్ర స్థాయిలో జరుగుతోంది అనే విషయం బయటకు వచ్చింది. మంచు మోహన్ బాబు… మనోజ్ కు అన్యాయం చేస్తున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది.
మోహన్ బాబు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులు నమోదు అయ్యాయి పోలీస్ స్టేషన్ లో. నటుడు మోహన్ బాబు పై కొడుకు మంచు మనోజ్ ఫిర్యాదు చేసాడు. తండ్రి తనని కొట్టాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడట. మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై మోహన్ బాబు ఫిర్యాదు చేసాడు. ఆస్తుల, స్కూలు వ్యవహారంలో పరస్పరంగా దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. గాయాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చి మంచు మనోజ్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. తనతో పాటు తన భార్యపై దాడి చేశారని మోహన్ బాబు పై ఫిర్యాదు చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి.
అయితే దీనిపై మోహన్ బాబు సన్నిహిత వర్గాలు మాత్రం పెదవి విరిచాయి. మోహన్ బాబు గారు మంచుమనోజ్ పరస్పర ఫిర్యాదులు చెసుకున్నారనే వార్తల్లో నిజం లేదని మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కధనాలను కొన్ని మీడియా చానెల్స్ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని వాటిలో నిజం లేదు అంటూ కొట్టిపారేశారు. కాని ఈ వివాదాలను దగ్గర నుంచి గమనిస్తున్న వారు మాత్రం కచ్చితంగా మంచు కుటుంబంలో గొడవలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని కుండ బద్దలు కొట్టి చెప్తున్నారు.
మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో మంచు విష్ణు కర్త, కర్మ, క్రియగా వ్యవహరించి మనోజ్ కు అన్యాయం చేయడం పట్ల ఆయన భార్య మౌనిక కూడా నిలదీసిందట. దానికి మోహన్ బాబు కాస్త రూడ్ గా సమాధానం చెప్పడంతోనే గొడవ పెద్దది అయిందని ఆ తర్వాత మోహన్ బాబు చేయి చేసుకున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అలాగే హైదరాబాద్ లో ఉన్న ఆస్తులపై కూడా మనోజ్ ను దూరం పెడుతున్నారట. విష్ణు, లక్ష్మీ ఇద్దరూ మనోజ్ ను వేరుగా చూస్తున్నారని ఎప్పటి నుంచో జనాలకు ఓ క్లారిటీ ఉంది.
కాని బయట పెదరాయుడులా కలరింగ్ ఇచ్చే మోహన్ బాబు ఇంట్లో మాత్రం అలా వ్యవహరించడం లేదని మనోజ్ ఆగ్రహంగా ఉన్నాడట. మోహన్ బాబు మొదటి భార్య పిల్లలు అయిన విష్ణు, లక్ష్మీ… మనోజ్ విషయంలో అలా వ్యవహరించడాన్ని మోహన్ బాబు సతీమణి కూడా జీర్ణించుకోలేదనే కథనాలు కూడా వచ్చాయి. ఇక భూమా మౌనికను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మనోజ్ కు ఇబ్బందులే ఎదురయ్యాయట. మోహన్ బాబు అక్కడి నుంచి పక్షపాతిగా వ్యవహరించడం మొదలుపెట్టారట. దీనితో మౌనిక కూడా తన మామగారి తీరుపై సీరియస్ గా ఉంది. ఈ వ్యవహారాన్ని కుటుంబ సన్నిహితులు పరిష్కరించే ప్రయత్నం చేసినా కూడా… ఓ కొలిక్కి రాలేదని అంటున్నాయి సినీ వర్గాలు. మరి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.