Film Promotions Trends: హే..ప్రమోషన్లే మామ.. సినిమాకి లైఫ్ ర మామ..!

సినిమా అంటూనే అందరికీ ఆసక్తిని కలిగించే అంశం వినోదం. అది కథను బట్టీ రకరకాలుగా ఉంటుంది. ఈ 24 క్రాఫ్ట్ ల రంగుల పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంటే చాలా ఓపిక ఉండాలి. అలాగే మార్కెట్ దృష్టిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రయాణం సాగించాలి. వీటితోపాటూ ప్రేక్షకుడి అభిరుచిని కూడా గుర్తించగలిగి అతని నాడీని పట్టుకోగలగాలి. ఇన్ని అంశాలపై పట్టు సాధించినా కూడా ఒక్కోసారి చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ ఉంటుంది. ఎన్ని ఓడిదుడుకులు ఎదురైనాప్పటికీ సరికొత్త ప్రయోగంతో సినిమా ప్రమోషన్స్ చేపడుతూ దూసుకుపోతుంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ. ఈ పరిణామక్రమంలో వచ్చిన క్రియాశీలక మార్పులను కొన్నింటింని ఇప్పుడు తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 4, 2023 | 03:21 PMLast Updated on: Apr 04, 2023 | 3:22 PM

Film Promotions Trends

1991 నుంచి 2000 మధ్య కాలంలో ముందుగా పాటలను విడుదల చేసే ప్రోగ్రాంలు ఏర్పాటు చేసేవారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వార్తను వాల్ పోస్టుల రూపంలో థియేటర్ యాజమాన్యాలు వారి హాలు పరిధిలోని ప్రాంతాల్లోని గోడలకు అతికించే వారు. తద్వారా సినిమాలోని హీరో ఫస్ట్ లుక్ లేదా హీరోహిన్ మొదటి స్టిల్ బయటకు వచ్చేది. ఆతరువాత అప్పటి ప్రదాన స్రవంతి మాధ్యమాల్లో వేడుకకు సంబంధించిన మొత్తం కార్యక్రమాన్ని లైవ్ లో అందించేవారు. లైవ్ ప్రోగ్రాంను ఎవరైనా చూడలేక పోతే మరుసటి రోజు.. తరువాతి వారం.. ఇలా ఏదో ఒక సమయంలో ప్రసారం చేసేవారు. ఆ కార్యక్రమం చూసిన తరువాతనే చిత్ర వివరాలు మనకు తెలిసేది. అందులో పాటలు ఎలా ఉన్నాయి. హీరో ఏపాత్ర చేస్తున్నాడు. హీరోహిన్ ఎలా కనిపిస్తుంది. విలన్ పాత్ర ఎవరు పోషిస్తున్నారు. ఇలా తదితర వివరాలన్నీ ఈ కార్యక్రమంలో తెలసేలా ప్లాన్ చేసేవారు. ఇలా ఆ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ చేసేవారు.

Chiranjeevi, Venkatesh

Chiranjeevi, Venkatesh

ఇక 2001 నుంచి 2010 మధ్య జరిగిన ఆడియో రిలీజ్ వేడుకను పరిశీలిస్తే కొంత మార్పు చోటు చేసుకుంది. ఈ దశాబ్ధకాలంలోనే మీడియా బాగా పుంజుకుంది. దీనికారణంగా ఆడియో వేడుకకు సంబంధించిన మొత్తం సమాచారం ముందుగానే ప్రతి ఒక్కరి ఇంటికి చేరిపోయేది. అందులోనూ వీకెండ్లలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు చిత్ర యూనిట్ ఎక్కువ ఆసక్తి చూపేవారు. దీనికి కారణం అందరూ ఇంట్లో ఉంటారు. తమ చిత్రానికి సంబంధించిన వివరాలు ప్రతిఒక్కరికీ చేరువౌతాయన్న ఆలోచనతో ఇలా నిర్వహించేవారు. పైగా ఆకర్షించేందుకు విడుదల కాబోతున్న సినిమాలోని పాటలకే రకరకాల స్టెప్పులతో ప్రేక్షకులను టీవీలకు అతుక్కునేలా చేసేవారు. ఆడియో రిలీజ్ వేడుకలో చివరగా ముఖ్య అతిథి చేతుల మీదుగా క్యాసెట్, సీడీలతో పాటూ ఒక పోస్టర్ ను అప్పుడే అదే వేదికపైన ఆవిష్కరించే వారు. వాటిని మరుసటి రోజు ప్రేక్షకులకు, సినిమా అభిమానులకు, సంగీత అభిరుచి కల్గిన వారికి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసేవారు. ఆడియో విడుదల అయిన రెండు రోజుల్లో క్యాసెట్లు, సీడీలు, వాల్ పోస్టర్లు స్థానిక మ్యూజికల్ షాపులో అందుబాటులో ఉండేవి. వాటిని కొనుగోలు చేసి ప్రతి ఆటోలో, రెస్టారెంట్లలో, ఇళ్లలో ప్లే చేసి ఆస్వాధించేవారు. వాల్ పోస్టర్లను అయితే అభిమానులు తమ ఇండ్లలో బీరువాలకు, గోడలకు అతికించుకునే వారు. తమ అభిమాన హీరోకి సంబంధించిన మరో కొత్త సినిమా పోస్టర్ విడుదల అయ్యేవరకూ అవి ఇంట్లో దర్శనం ఇస్తూ ఉండేవి. దీని ద్వారా సినిమా పబ్లిసిటీ కొంత ప్రజల్లోకి చేరువయ్యేది.

Poster Launch

Poster Launch

ఇప్పుడు అసలైన మజిలీ ఆవిష్కృతమైంది. 2011 నుంచి 2020 మధ్యలో వచ్చిన సినిమా పాటల ఫంక్షన్లు సరికొత్త ట్రెండ్ ను స్వాగతించాయి. సినిమా ముహూర్తం కొట్టే షాట్ నుంచి విడుదలకు సిద్దమయ్యే రోజు వరకూ ఏదో విధంగా ప్రేక్షకుల దృష్టిలో పడేందుకు విన్నూత్నమైన కార్యక్రమాలు చేపట్టేవి. సినిమాలో హీరో పాత్రకు సంబంధించిన ఒక డైలాగ్, హీరోహిన్ క్యారక్టర్ గురించి తెలిపేలా కొన్ని సీన్లతో టీజర్, కథను చెప్పి చెప్పనట్లుగా ఉండే ట్రైలర్, ఫైట్స్, స్టెప్స్, ఇలా రకరకాల వీడియోలను హీరో.. హీరోహిన్ పుట్టిన రోజు పేరుతోనో లేకుంటే పండుగల సందర్భంగానో విడుదల చేసేవారు. అది కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అయ్యేవి. ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో పోస్ట్ పెట్టిన గంటల వ్యవధిలో మిలియన్ వ్యూస్ లను సంపాధించుకునేలా ప్రమోషన్స్ పెరిగిపోయాయి. దీంతో సినిమాపై హైప్ బాగా క్రియేట్ అయ్యేది. ప్రేక్షకలను సినిమా థియేటర్లకు రప్పించేందుకు ఇది బాగా ఉపయోగపడేది.

ఇప్పటి వరకూ చెప్పింది బాగానే ఉంది. అసలైన సినిమా ఇప్పుడు కనిపించబోతుంది. సినిమా స్క్రిప్ట్ పూజ కంటే ముందుగా గ్లిమ్స్ పేరుతో స్లోమోషన్ విజువల్స్ ను దర్శక నిర్మాతల సామాజిక మాధ్యమలతోపాటూ హీరో హీరోహిన్ అకౌంట్లలో అప్లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం మీడియా డిజిటలైజేషన్ కావడంతో మునుపటి కంటే అత్యధిక వేగంగా సినిమా పబ్లిసిటీ దూసుకుపోతుంది. ఇది ఇక్కడితో ఆగితే బాగానే ఉండేది. 2021 నుంచి 2023 ఏప్రిల్ వరకూ చేసిన ప్రమోషన్స్ ఒక ఎత్తైతే తాజాగా విరూపాక్ష చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్ ఒక లెవెల్ అనిపించింది. సినిమా ఇంకా విడుదలకే నోచుకోలేదు. పాటలు కూడా విడుదల కాలేదు. ఇవన్నీ కాకుండానే సినిమా బృందం ప్రెస్ మీట్ పెట్టింది. ఈ సినిమాలో ఎవరెవరు ఏఏ పాత్రలు చేస్తున్నారో చెబుతూ.. చెప్పడమే కాకుండా సినిమాలో ఎలా కనిపిస్తారో అచ్చం అదే వేషధారణలో కనిపించి అందరిని షాక్ కి గురిచేశారు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్లను పరిచయం చేస్తూ సినిమా క్యారెక్టర్ ఇంట్రడ్యూసింగ్ మీట్ అనే పేరుతో సరికొత్త వింతైన కార్యక్రమానికి తెరతీశారు. ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదల కానున్నట్లు గతంలో విడుదలైన టీజర్, ట్రైలర్, గ్లిమ్స్ లో చెప్పినప్పటికీ.. ఇలా పాత్రధారులను అదే గెటప్ లో పరిచయం చేస్తూ ఇప్పటి వరకూ ఎవరూ చేయలేదు.

గతంలో ఈగ సినిమాలో రాజమౌళి ఈగ వేషధారణను ఒకరితో వేయించి ఆడియో రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు కదా అని మీలో కొంత మందికి అనుమానం రావచ్చు. అది ఆడియో రిలీజ్ తో పాటూ సినిమా విడుదలకు సిద్దం అయిన సందర్భంగా చేసిన ప్రోగ్రాం. అందులో కేవలం ఈగను ఒక్కటే చూపించారు. విరూపాక్షలో ప్రతి క్యారెక్టర్ ను తెరకు పరిచయం చేశారు. అంతేకాకుండా ఈగ సినిమా ప్రీరిలీజ్ వేడుక అయితే.. విరూపాక్ష క్యారెక్టర్ ఇంట్రడ్యూసింగ్ వేడుక. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. ఇలా రోజు రోజుకూ సినిమా ప్రమోషన్స్ వింతైన రూపాన్ని సంతరించుకుంటుంది. ప్రేక్షకుల మదిని దోచుకునే ప్రయత్నం చేస్తుంది.

ఏదేమైనా ప్రేక్షకుల మనసును దోచుకునేందుకు సినిమా వాళ్లు చేసే ప్రయోగాలు, ఫీట్లు, సృజనాత్మక ఆలోచనలు ప్రేక్షకులకు నిత్య నూతన భావనను అందజేస్తున్నాయి అని చెప్పవచ్చు.

 

T.V.SRIKAR