Friday Release: శుక్రవారమే సినిమాలు ఎందుకు రిలీజ్ చేస్తారు ? దీని వెనక ఇంత పెద్ద కథ ఉందా!
శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి. సినిమాలు కాకపోయినా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్.. ఇలా ఇండస్ట్రీ నుంచి ఎదో ఒక అప్‌డేట్ ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా శుక్రవారమే ఇలాంటివి జరగడం కోఇన్సిడెన్స్ కాదు. దీని వెనక పెద్ద కథే ఉంది.
నిజానికి ఈ శుక్రవారం సెంటిమెంట్ ఇండియాలో మొదలైంది కాదు. దీన్ని హాలీవుడ్ ప్రారంభించింది. మొదట అక్కడ ఏరోజు పడితే ఆరోజు సినిమాలు రిలీజ్ చేసేవారు. కానీ వాటికి పెద్దగా కలెక్షన్స్ వచ్చేవి కావు. కానీ శుక్రవారం రిలీజైన సినిమాలకు మాత్రం మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. మంచి కలెక్షన్స్ రాబట్టేవి. దీనికి కారణం.. శుక్రవారం పేయింగ్ డే కావడం. అక్కడ వారమంతా పని చేయించుకుని శుక్రవారం జీతాలు ఇచ్చేవాళ్లు. శని, ఆది వారాలు హాలిడే ఉండేది. దీంతో శాలరీ రాగానే అంతా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి సినిమాకు వెళ్లేవాళ్లు.
ఒకవేళ శుక్రవారం బిజీగా ఉన్నా.. శనివారం, ఆదివారం సెలవు కావడంతో ఆరోజు సినిమాకు వెళ్లేవాళ్లు. ఇలా శుక్రవారం రిలీజైన సినిమాలకు అక్కడ మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. మెల్లమెల్లగా ఇదే సాంప్రదాయాన్ని ఇండియన్ సినిమా కూడా ఫాలో అయ్యింది. అంతే కాదు.. ఇండియాలో శుక్రవారాన్ని చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆరోజు చేసే పనులు సక్సెస్ అవుతాయనేది చాలా మంది నమ్మకం. చాలా మంది శుక్రవారం రోజునే కొత్త పనులు ప్రారంభిస్తారు.
హాలివుడ్ నేర్పిన టెక్నిక్‌తో పాటు శుక్రవారం మనకు కూడా సెంటిమెంట్ కావడంతో ఇక్కడ కూడా శుక్రవారం రోజునే సినిమాలు రిలీజ్ చేయాలని నిర్ణయించారు. సినిమా రిలీజ్ కాకపోయినా సినిమాకు సంబంధించిన ఏదైనా అప్‌డేట్ ఇచ్చేందుకు కూడా మాగ్జిమం అంతా శుక్రవారాన్ని ప్రిఫర్ చేస్తారు. అందుకే శుక్రవారం వచ్చిందంటే ప్రతీ సినిమా అభిమాని థియేటర్‌కు క్యూ కడతాడు. ఏదైనా అప్‌డేట్స్ ఉన్నాయా అని చెక్ చేసుకుంటాడు.