ఫైనల్ గా బాలయ్య ఫ్యాన్స్ కు వేరి బిగ్ గుడ్ న్యూస్
నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన డాకు మహారాజ్ సినిమా థియేటర్లలో ఇప్పటికీ కొన్నిచోట్ల ఆడుతూనే ఉంది. ఈ సినిమాకు తగినన్ని థియేటర్లను కేటాయించలేదు అనే కామెంట్స్ కూడా ఫ్యాన్స్ నుంచి వినిపించాయి.
నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన డాకు మహారాజ్ సినిమా థియేటర్లలో ఇప్పటికీ కొన్నిచోట్ల ఆడుతూనే ఉంది. ఈ సినిమాకు తగినన్ని థియేటర్లను కేటాయించలేదు అనే కామెంట్స్ కూడా ఫ్యాన్స్ నుంచి వినిపించాయి. వసూళ్ల పరంగా తగ్గడానికి అదే కారణం అని, దిల్ రాజు తన సినిమా కోసం ఈ సినిమాకు అన్యాయం చేశారని కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సినిమా ఓటిటిలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే… నెలరోజులు దాటింది.
సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అయిపోయింది. ఇక డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ కు నెట్ఫ్లిక్స్ ముహూర్తం ఎప్పుడు ఖరారు చేసిందని దానిపై క్లారిటీ రాలేదు. అటు మేకర్స్ కూడా దీనిపై ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు. ఈ సినిమాలో బాలయ్యను కొత్తగా చూపించాడు డైరెక్టర్ బాబి కొల్లి. ముఖ్యంగా బాలయ్య మేనరిజం, ఆయన ఎనర్జీకి అభిమానులు ఫిదా అయిపోయారు. సంక్రాంతి కానుకగగా వచ్చే బాలయ్య సినిమాలు ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయి.
దానికి తోడు అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్య ఏ సినిమా చేసిన సరే సూపర్ హిట్ అవుతూనే ఉన్నాయి. ఇక డాకు మహారాజు కూడా ఇదే స్వింగ్లో వచ్చి సూపర్ హిట్ కొట్టింది. తమన్ అందించిన మ్యూజిక్ అయితే వేరే లెవల్ అని చెప్పాలి. దీంతో బాలయ్య లేటెస్ట్ గా తమన్ కు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఏకంగా రెండు కోట్లు ఖరీదు చేసే ఒక కారును గిఫ్ట్ గా ఇచ్చారు తమన్ కు. ఇక ఈ సినిమాను బాలయ్య చాలా ప్రెస్టీజియస్ గా కూడా తీసుకున్నారు. 2024 లో హ్యాట్రిక్ కొట్టి హిందూపురం నుంచి ఆయన మరోసారి ఎమ్మెల్యే అయ్యారు.
రీసెంట్ గా ఆయనకు కేంద్ర ప్రభుత్వం కూడా పద్మభూషణ్ అవార్డును అనౌన్స్ చేసింది. ఈ టైం లో వచ్చిన డాకు మహారాజ్ సినిమా బాలయ్యకు ను వేరే లెవల్ కు తీసుకెళ్లింది. ఇక ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ డేట్ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. కానీ లేటెస్ట్ గా నెట్ఫ్లిక్స్ దీనిపై అనౌన్స్మెంట్ చేసింది. దాదాపు 90 కోట్లు ఖర్చు చేసి ఈ సినిమాను కొన్నట్లు టాక్. ఇక ఎక్కువ లేట్ చేయకుండా ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ సినిమా రీలోడేడ్ వెర్షన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. రీలోడెడ్ వర్షన్ పై ఇప్పటికే వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. డైరెక్టర్ బాబి కొల్లి కొన్ని పవర్ఫుల్ సీన్స్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా డాకు మహారాజ్ గా మారినప్పటి నుంచి కొన్ని సీన్స్ ను యాడ్ చేస్తున్నారట. దాదాపు 15 నుంచి 20 నిమిషాలు సినిమా రన్ టైం పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇక ఈ సినిమాకు 200 నుంచి 250 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి.