Game Changer : ఫైనల్‌గా ‘గేమ్ చేంజర్’ రిలీజ్ డేట్ ఫిక్స్
గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్ (Ram Charan) హీరోగా స్టార్ డైరెక్టర్ (Star Director) శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా గేమ్ చేంజర్ (Game Changer) సినిమా తెరకెక్కిస్తున్నాడు. అయితే.. ఈ సినిమా షూటింగ్ మాత్రం కంప్లీట్ అవడం లేదు.

Finally the release date of 'Game Changer' is fixed
గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్ (Ram Charan) హీరోగా స్టార్ డైరెక్టర్ (Star Director) శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా గేమ్ చేంజర్ (Game Changer) సినిమా తెరకెక్కిస్తున్నాడు. అయితే.. ఈ సినిమా షూటింగ్ మాత్రం కంప్లీట్ అవడం లేదు. దీంతో విడుదల డేట్ కూడా ప్రకటించడం లేదు. కానీ తాఆజగా నిర్మాత దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి ఇటీవల ఒక చిట్ చాట్‌లో మాట్లాడుతూ..గేమ్ చేంజర్ సినిమా విడుదల అక్టోబర్‌లో ఉంటుందని చెప్పుకొచ్చారు.
అయితే రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు. కానీ అక్టోబర్ అంటే.. 31న గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆరోజు గురువారం అవుతోంది. పైగా దీపావళి కాబట్టి.. లాంగ్ వీకెండ్ కలిసొచ్చేలా గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ అదే అక్టోబర్ 10న దసరా కానుకగా దేవర రిలీజ్ అవుతోంది. దీంతో.. అక్టోబర్‌లో గేమ్ చేంజర్ అంటే దేవరకు పోటీగా వస్తుందనే చర్చ జరుగుతోంది. కానీ అలా జరిగే ఛాన్స్ లేదు.
దేవర వచ్చిన మూడు వారాల తర్వాతే గేమ్ చేంజర్ థియేటర్లోకి రానుందని అంటున్నారు. దేవర దసరాను టార్గెట్ చేస్తే.. గేమ్ చేంజర్ దీపావళి పండగను క్యాష్ చేసుకోనుంది. కానీ అక్టోబర్‌లో మాత్రం మెగా నందమూరి అభిమానులు పండగేనని చెప్పాలి. త్వరలోనే గేమ్ చేంజర్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతానికైతే.. శంకర్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శంకర్ మార్క్ పొలిటికల్ డ్రామాగా వస్తున్న గేమ్ చేంజర్ మామూలుగా ఉండదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.