Salman Khan : సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం
బాలీవుడ్ (Bollywood) ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి వద్ద కొందరు దుండగులు కాల్పులు కలకలం సృష్టించాయి. ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు.

Firing broke out at Salman Khan's house
బాలీవుడ్ (Bollywood) ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి వద్ద కొందరు దుండగులు కాల్పులు కలకలం సృష్టించాయి. ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. సల్మాన్ నివాసముండే ముంబాయిలోని బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అప్టార్ట్‌మెంట్స్ ముందు ఈ ఘటన జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణులు సైతం అక్కడికి చేరుకున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సల్మాన్‌ను బెదిరిస్తూ గతేడాది ఆయన ఆఫీస్‌కు ఈమెయిల్స్ వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన ముంబాయి పోలీసులు గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ (Goldie Brar) పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వీళ్లు టార్గెట్ చేసిన జాబితాలో సల్మాన్ పేరున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరగుతున్న సమయంలో బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్ దెబ్బతీశారంటూ 2018లో లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bistoy) వ్యాఖ్యానించాడు.
ఇదే విషయంపై ఆయనకు మెయిల్‌లో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. 2023 ఏప్రిల్‌లో ఇలాంటి బెదిరింపులు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేడ్ భద్రతను Y+గా అప్‌గ్రేడ్ చేసింది. దీంతో ఇద్దరు సాయుధ గార్డులు సల్మాన్కు నిత్యం భద్రతగా ఉంటున్నారు.