ఫస్ట్ పాన్ వరల్డ్ రికార్డు.? మాస్ మ్యాజిక్ తో సాధ్యమా..?

తెల్లోల్లు కూడా తెలుగోల్ల మాస్ సినిమాలకు అడిక్ట్ అవుతున్నారా? పిడికెడంత మంది తెల్లోల్లు మన మూవీలు చూస్తే, అమెరికన్లు, యూరోపియన్లు మనకి అలవాటు పడ్డట్టేనా? అయినా పాన్ వరల్డ్ అంటే ఎందుకు అమెరికా, యూరప్ మాత్రమే టార్గెట్ చేస్తారు..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 25, 2025 | 11:54 AMLast Updated on: Jan 25, 2025 | 11:54 AM

First Pan World Record Is It Possible With Mass Magic

తెల్లోల్లు కూడా తెలుగోల్ల మాస్ సినిమాలకు అడిక్ట్ అవుతున్నారా? పిడికెడంత మంది తెల్లోల్లు మన మూవీలు చూస్తే, అమెరికన్లు, యూరోపియన్లు మనకి అలవాటు పడ్డట్టేనా? అయినా పాన్ వరల్డ్ అంటే ఎందుకు అమెరికా, యూరప్ మాత్రమే టార్గెట్ చేస్తారు..? రష్యా, చైనా,జపాన్, బ్రెజీల్ తో అవసరం లేదా? వీటన్నీంటికంటే ముందు పాన్ వరల్డ్ ట్రెండ్ బెండు తీసే రికార్డు ఎవరికి దక్కబోతోంది? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ కే ఫస్ట్ పాన్ వరల్డ్ సినిమా క్రెడిట్ దక్కేలా ఉంది. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌలి ఆల్రెడీ లాంచ్ చేసిన ప్రాజెక్టే పాన్ వరల్డ్ గోడల్ని బద్దలు కొట్టేఛాన్స్ ఉంది. కాని తన కంటే ముందు ఎన్టీఆర్ సినిమాకే ఆ రికార్డు సొంతమయ్యే అవకాశం ఎక్కువ. దానికి సాలిడ్ రీజన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఐతే ఇక్కడ మరో భారీ కటౌట్ రెబల్ స్టార్ ని లైట్ తీసుకునే ఛాన్స్ లేదు. తన ఫౌజీ కేవలం పాన్ ఇండియా ప్రాజెక్ట్ మాత్రమే కాదు. అసలా జోనరే యూరప్ మార్కెట్ ని టార్గెట్ చేసేందుకు ప్లాన్ చేశారు.. సో ఈ లెక్కన ఫస్ట్ పాన్ వరల్డ్ రికార్డ్ ఎవరికి దక్కబోతోంది?

పదేళ్ల క్రితం బాహుబలి లాంటి సినిమా వచ్చి, సౌత్ నార్త్ మధ్యలో ఉన్న గోడల్ని కూల్చేసింది. తర్వాతే పాన్ ఇండియా మార్కెట్ ట్రెండ్ షురూ అయ్యింది. తెలుగు సినిమాలు నార్త్ మార్కెట్ ని డామినేట్ చేయటం మొదలైంది. కట్ చేస్తే పదేళ్ల తర్వాత అంటే ఇప్పుడు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ కి మన సినిమా ను ప్రమోట్ చేయబోతున్నారు. ఆ బాధ్యత కూడా రాజమౌలినే తీసుకున్నాడు.

మహేశ్ బాబుతో, 1000 కోట్ల బడ్జెట్ పెట్టి, పాన్ వరల్డ్ సినిమా తీస్తున్నాడు.అంటే పాన్ వరల్డ్ గేట్లు కూడా పాన్ ఇండియా గేట్లు బద్దలు కొట్టినట్టే, రాజమౌళినే ఈ టాస్క్ పూర్తి చేస్తాడా అంటే, అంతకంటే ముందు సీన్ లోకి ఎన్టీఆర్ వస్తున్నాడు. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తను చేస్తున్న డ్రాగన్ మూవీ కూడా పాన్ వరల్డ్ ప్రాజెక్టే. కాకపోతే, రాజమౌళి తీసే సినిమా పూర్తవటానికే రెండేళ్లు పడుతుంది. కాబట్టి దానికంటే ముందొచ్చే సినిమాల్లో ఏది వర్కవుట్ అయినా, పాన్ వరల్డ్ హిట్ పడినట్టే

ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ మూవీ పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేసుకుంది. కాని చైనా, జపాన్, కొరియా మార్కెట్లే ముందుగా ఫోకస్ చేస్తోంది ఫిల్మ్ టీం. దీంతో ఇది పాన్ ఆసియా మూవీనే అవటానికి ఛాన్స్ ఎక్కువన్నారు. కాని కొరయన్ సినిమాలు అమెరికా, యూరప్ మార్కెట్లని డామినేట్ చేస్తున్నాయి. అంటే వాళ్లకి నచ్చితే, యూఎస్, యూకేలో తెల్లోల్లు కూడా మన మూవీలకు ఫిదా అయ్యే ఛాన్స్ ఉంది..

కేవలం తెలుగు సినిమాను, ఐదు భాషల్లో రిలీజ్ చేస్తే పాన్ ఇండియా మూవీ అయిపోదు. పాన్ ఇండియా మార్కెట్ ని శాసిస్తేనే, ఆ క్రెడిట్ దక్కుతుంది. అలానే ఇంగ్లీష్, స్పానిష్, ఇటాలియన్, జెర్మన్, రష్యన్ లో తెలుగు సినిమాను రిలీజ్ చేస్తే సరిపోదు.. అక్కడి లోకల్ ఆడియన్స్ థియేటర్స్ వైపు క్యూ కడితేనే, మన బొమ్మకి వాళ్ల బాక్సాఫీస్ ఊగిపోయిందనే అవకాశం ఉంటుంది. అదే ఎంతవరకు ఛాన్స్ ఉందో తేలాలంటే మన పాన్ వరల్డ్ మూవీలు రిలీజ్ అవ్వాలి

సో రిలీజ్ డేట్ పరంగా చూస్తేరాజమౌళి మూవీకంటే డ్రాగన్ సినిమానే వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుంది కాబట్టి, ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ ఇదే అనొచ్చు.. కాని సీన్ లోకి రెబల్ స్టార్ ప్రభాస్ ఫౌజీ మూవీ కూడా వచ్చింది. ఇది సంక్రాంతి లేదంటే సమ్మర్ కి అంటున్నారు. కాబట్టి, డ్రాగన్ తోపాటు ఫౌజీ కూడా ఇండియాస్ ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ క్రెడిట్ దక్కించుకునే అవకాశం ఉంది. ఐతే మాత్రం ఒకటి, బాహుబలి ఎలాగైతే నార్త్ మార్కెట్ బాక్సాఫీస్ ని బద్దలు కొట్టిందో, అలా వెస్టర్న్ కంట్రీస్ మార్కెట్ ని ఎవరు బద్దలు కొడితే, వాళ్లకే ఆ రికార్డు దక్కుతుంది.