Pushpa 2: పుష్ప గాడి రచ్చ షురూ.. మొదటి పాట విడుదల ఎప్పుడంటే..

బుధవారం, ఏప్రిల్ 24న సాయంత్రం 4.05 గంటలకు ఈ ప్రోమోను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 24, 2024 | 12:05 PMLast Updated on: Apr 24, 2024 | 12:05 PM

First Single Promo Of Pushpa 2 Coming Out On Wednesday

Pushpa 2: మరికాసేపట్లో పుష్ప గాడి రచ్చ మొదలుకానుంది. పుష్ప 2 మూవీ నుంచి పుష్ప పుష్ప అంటూ సాగిపోయే ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేయడానికి మేకర్స్ అంతా రెడీ చేశారు. దీనికి కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. బుధవారం, ఏప్రిల్ 24న సాయంత్రం 4.05 గంటలకు ఈ ప్రోమోను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు.

Rajinikanth: సూపర్ స్టారా మజాకా..? ఆసియాలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్..?

ఇక అప్పటి నుంచి పుష్ప రచ్చ ఏ రేంజ్‌లో ఉండబోతుందా అన్న ఉత్సుకత అందరిలో మొదలైపోయింది. సాయంత్రం రికార్డుల మోత ఖాయమంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే హడావిడి మొదలు పెట్టేశారు. ఆగస్ట్ 15న రిలీజ్ కానున్నపుప్ఫ-2 మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ తో ఆ అంచనాలు కాస్తా స్కై హైని తాకుతున్నాయి.

పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం నాలుగు నెలల ముందు నుంచే మేకర్స్ ప్రమోషన్లు మొదలు పెట్టారు. పుష్ప సాంగ్స్ తో సంచలనం రేపిన దేవిశ్రీ ప్రసాదే ఈ సీక్వెల్ కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో.. ఇవాళ సాయంత్రం రిలీజ్ కానున్న ఫస్ట్ సింగిల్ ప్రోమో ఏ రేంజ్‌లో దుమ్ము రేపుతుందో అన్నది అంచనాలకు అందడం లేదు. పుష్ప పార్ట్‌ 1 సాధించిన భారీ విజయంతో పాన్ ఇండియా లెవెల్‌లో పుష్ప-2 కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. దీంతో.. పుష్ప-2 బిజినెస్‌ అంచనాలకు మించి జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. రిలీజ్ కు ముందే అన్ని రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ప్రీరిలీజ్ బిజినెస్ ద్వారానే రూ.1000 కోట్ల మార్క్ అందుకున్నట్లు ఈ మధ్యే వార్తలు వచ్చాయి.

Vijay-prashanth neel: విజయ్ దేవరకొండ – ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో నిజమేనా..?

నార్త్ లో థియేట్రికల్ హక్కుల ద్వారానే రూ.200 కోట్లు రాగా.. ఇక మిగతా భాషల థియేట్రికల్ హక్కుల ద్వారా మరో రూ.270 కోట్లు రానున్నాయి. మొత్తంగా థియేట్రికల్ హక్కుల ద్వారానే రూ.550 కోట్లు సొంతం చేసుకుంది. ఇక డిజిటల్, ఆడియో, శాటిలైట్, ఓవర్సీస్ హక్కులన్నీ కలిపితే రూ.వెయ్యి కోట్లు అవుతున్నాయి. మొత్తానికి పుష్ప మూవీతో నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడీ సీక్వెల్ తో పాన్ ఇండియా స్థాయిలో మరోసారి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాల్సిందే.