Devara first single : ‘దేవర’ ఫస్ట్ సాంగ్ కి ముహూర్తం ఫిక్స్!
అసలే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), దానికి తోడు మాస్ ని తన మ్యూజిక్ తో ఉర్రూతలూగించే అనిరుధ్. ఈ ఇద్దరూ కలిస్తే ఇంకేమైనా ఉందా.

Fix the moment for the first song of 'Devara'!
అసలే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), దానికి తోడు మాస్ ని తన మ్యూజిక్ తో ఉర్రూతలూగించే అనిరుధ్. ఈ ఇద్దరూ కలిస్తే ఇంకేమైనా ఉందా. అందుకే ‘దేవర’ సాంగ్స్ (Devara Songs) కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ‘దేవర’ (Devara) నుంచి త్వరలోనే మాస్ జాతర చూడబోతున్నాం. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ కి ముహూర్తం ఖరారైందని సమాచారం.
ఎన్టీఆర్ (NTR) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ‘దేవర’. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న మొదటి పాటను విడుదల చేయనున్నట్లు వినికిడి. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకి అనిరుధ్ ఎలాంటి మాస్ బీట్ ఇచ్చాడోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. మరి ఎన్టీఆర్ కి అనిరుధ్ ఏ రేంజ్ మ్యూజిక్ ఇస్తాడో చూడాలి.
ఎన్టీఆర్ ఆర్ట్స్ (NTR Arts), యువసుధ ఆర్ట్స్ (Yuvasudha Arts) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) విలన్ (Villain) గా నటిస్తున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.