మెగా పవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ మూవీ గేమ్ చేంజర్, వరల్డ్ వైడ్ గా రిలీజైంది. అంటే ప్రివ్యూతోనే ఈ సినిమా జాతకం బయట పడింది... ఆరకంగా సినిమా సందడి మొదలైందని చెప్పొచ్చు. ఇక ఇందులో ఏం బాగుంది. ఏం బాలేదనే విషయానికొస్తే, ఈమూవీలో బీజీఎం అదిరింది. కాని బాక్సాఫీస్ లో సినిమా తుస్సే అంటున్నారు.. రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ తో మెంటలెక్కించాడంటున్నారు. కాని గేమ్ జామ్ అయిపోయిందని తేల్చారు. శంకర్ మీద ఎలాగూ నమ్మకం లేదు. భారతీయుడు 2 తో తనెంత ఔట్ డేట్ అయ్యాడో అందరికి అర్ధమైంది. కాకపోతే ట్రైలర్ పేలింది కాబట్టి బాక్సాఫీస్ లో మిరాకిల్స్ జరుగుతాయనుకున్నారు. కాని మిస్టేక్సే కనిపిస్తున్నాయి. చరణ్ అండ్ కో యాక్టింగ్ నెక్ట్స్ లెవల్లో ఉంది.. క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది... కాని సెకండ్ హాఫ్ తో తలనొప్పిరా బాబోయ్ అంటున్నారు.. అన్ని బాగున్నాయ్ అన్నారంటే, సినిమా హిట్ అనాలి.. కాని అనట్లేదు. శంకర్ ఈజ్ బ్యాక్ అన్నారంటే, ఫైనల్ టాక్ కిక్ ఇవ్వాలి.. కాని ఇవ్వట్లేదు. ఇంతకి గేమ్ ఛేంజర్ ని ఫ్లాపని తేల్చారా? కావాలని ప్రచారం చేస్తున్నారా? తమిళ నాడులో శంకర్ మీద అభిమానంతో అయినా గేమ్ ఛేంజన్ ని చూస్తున్నారా ? ఫైనల్ రిపోర్ట్ తో ఏం తేలింది... కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ ఒకప్పుడు లివింగ్ లెజెండే.. కాని ఐ, రోబో2.0, నన్బన్, ఫ్లాపులతో తన రేంజ్ పడిపోయింది. భారతీయుడు2 డిజాస్టర్ తర్వాత శంకర్ తో ఎందుకురా బాబు రామ్ చరణ్, దిల్ రాజు సినిమా తీశారనేంతగా ఇమేజ్ డ్యామేజ్అయ్యింది. అలాంటి టైంటో గేమ్ ఛేంజర్ ట్రైలర్ వచ్చి, షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా పాజిటివ్ టాక్ పెరిగి, హైప్ వచ్చింది. సరే సంక్రాంతికి మిరాకిల్స్ కాకున్నా ఓమాదిరీ హిట్ వచ్చినా చరణ్ పరువు కాపాడుకున్నట్టౌతుందనుకుంటే... సీన్ రివర్స్ గేమ్ ఛేంజర్ ఫస్డ్ డే కి ముందే ప్రివ్యూతో రిజల్ట్ తేలింది ఇందులో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ మైండ్ బ్లోయింగ్ గా సెట్ అయ్యింది. అలాని హిట్టైందా అంటే అది లేదు..కథ విషయానికొస్తే, ఓ మంత్రికి, ఐఏఎస్ ఆఫీసర్ కి మధ్య జరిగే వారే గేమ్ ఛేంజర్ అని ఎప్పుడో శంకరే స్టోరీలైన్ తేల్చాడు. అంతకుమించి ఇందులో ట్విస్టులు ఊహించలేం. ఇటు సివిల్ సర్వెంట్ గా , అటు నాయకుడిగా చరణ్ డ్యూయెల్ రోల్ మతిపోగొడుతుంది. ఎస్ జే సూర్య కూడా మూడు వేరియేషన్స్ తో, మూడు టైం లైన్స్ లో తన పాత్ర అప్పియరెన్స్ కి తగ్గ, పెర్ఫామెన్స్ తో షాక్ ఇచ్చాడు. అంజలి, కైరా అద్వాని, బ్రహ్మానందం, శ్రీకాంత్, ఇలా ఎవ్వరి పాత్రలో వాళ్లు పర్లేదనిపిస్తే. పాటలే జస్ట్ యావరేజ్ గా అనిపించాయనే టాక్ పెరిగింది.ఒక్కో పాటకి 70 నుంచి 75 కోట్లు ఖర్చు చేశారు కాబట్టి, ఆ గ్రాండియర్ నెస్ పిక్చరైజేషన్ లో కనిపించింది. అలా పాటలు నచ్చుతున్నాయే కాని, ఆడియో పరంగా తమన్ మ్యూజిక్ పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయింది. కాని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం తమన్ చింపేశాడు శంకర్ కి కత్తిలాంటి కథ దొరికితే, పావలా సినిమాని పదివేలకు మార్చేస్తాడు. ఆమాట గేమ్ ఛేంజర్ తో ప్రూవ్ అయ్యింది. ఈ సినిమా క్లైమాక్స్ పదినిమిషాలు బాక్సాఫీస్ బద్దలయ్యేలా ట్విస్ట్ తో జనాలకు గూస్ బంబ్స్ వస్తున్నాయి. ఇక భారతీయుడు2 కి గేమ్ ఛేంజర్ కి నెరేషన్ లో అస్సలు పోలికే లేదు. కాకపోతే ఇన్ని గుడ్ క్వాలిటీస్ చెప్పినా సినిమా తుస్సందనటానికి ఒకటే రీజన్. అదే గేమ్ ఛేంజర్ సెకండ్ హాఫ్. ఈ సినిమా రెండో భాగమైతే, సిరీయల్ కంటే స్లోగా సాగింది... అక్కడే ఆడియన్స్ కి హెడ్డేక్ అంటున్నారు. ఇక ఇందులో చరణ్ రెండో పాత్ర ఎంత్ మాసైనా, లుంగీలో తను కనిపించినా, ఎక్కువగా క్లాస్ టచ్ ఉండటంతో నార్త్ ఆడియన్స్ కి ఎక్కడం కష్టమే అనంటున్నారు. అసలే నార్త్ మార్కెట్ లో సినిమా ఆడాలంటే, ఊరమాస్ మూవీలకే కలిసొస్తుంది. ఇదేమో క్లాస్ మూవీ అవటంతో, అన్ని తెలిసే నార్త్ లో భారీగా ప్రమోట్ చేయలేదమో సినిమా టీం. కాకపోతే నార్త్ ఇండియాలో కాస్త పాజిటివ్ టాకే వచ్చినా, వసూళ్ల సునామీ ఎక్స్ పెక్ట్ చేసే పరిస్థితుల్లేవు... తెలుగు సినిమాలొస్తే కుల్లుతో చూడకూడదనుకునే, అరవ జనం, కనీసం శంకర్ మీద గౌరవంతో గేమ్ ఛేంజర్ చూస్తారా అంటే, పరిస్థితులే పాజిటివ్ గా కనిపించట్లేదు. మొత్తంగా గేమ్ కాస్త జామ్ అయ్యేలా ఉందనే టాకే పెరిగింది. పుష్ప2 ని మించే మూవీ కాదని అల్లు ఆర్మీ ఎటాక్ చేస్తుంటే, గేమ్ ఛేంజర్ టాక్ మాత్రం అందుకు తగ్గట్టుగానే ఉంది. [embed]https://www.youtube.com/watch?v=H5q1X0abB8A[/embed]