Pawan Kalyan: పవన్ కళ్యాణ్ దారిలోనే.. కోలీవుడ్ పవర్ స్టార్ లెక్కేవేరు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నితిన్, నిఖిల్ లాంటి యంగ్ హీరోలకే కాదు పెద్ద హీరోలకు కూడా అభిమానం ఎక్కువే. ఆలిస్ట్ లో తమిళ దళపతి విజయ్ కూడా ఉన్నాడు. అప్పట్లో ఒకరి మూవీలు మరొకరు రీమేక్స్ చేసుకునే వాళ్లు. ఓరకంగా పవన్ మ్యానరిజమ్స్ ని, యూత్ ని ఆకట్టుకునే అంశాలని తమిళ స్టార్ విజయ్ అప్పట్లో ఫాలో అయ్యేవాడు.

Following Power Star Pawan Kalyan, Kollywood star hero Vijay Dalapathy is making a padayatra for his political entry
అలాంటి విజయ్ ఇప్పుడు రాజీకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ నే అనుకరిస్తున్నాడు. రెండే ళ్లుగా తమిల స్టార్ విజయ్ రాజీకీయాల్లోకి వస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఐతే ఇప్పుడు తను తమిళ నాడు మొత్తం పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నాడని, అదే నిజమైతే, దసరాలోపు పార్టీని ఎనౌన్స్ చేస్తాడని తెలుస్తోంది.
లియో మూవీ పూర్తైంది కాబట్టి ఇదే తన ఆఖరి మూవీ, ఇక రాజకీయాలకే విజయ్ అంకితం అన్నారు. కాని వెంకట ప్రభు మేకింగ్ లో ఓ సినిమా, తర్వాత శంకర్ డైరెక్షన్ లో పొలిటికల్ డ్రామా ప్లాన్ చేసుకున్న విజయ్, ఈ వియంలో పవన్ నే ఫాలో అవుతాడట. రాజకీయాల్లో దూకుడు పెంచుతూనే, సినిమాలు చేస్తాడట.. సో ఈ విషయంలో కూడా పవన్ దారిలోనే విజయ్ నడవబోతున్నాడనే అంచనాలు పెరిగాయి.