KUMARI AUNTY : టీవీ సీరియల్ లో కుమారీ ఆంటీ
రెండు లివర్లు ఎక్స్ ట్రా... మొత్తం వెయ్యి రూపాయలు... ఈ డైలాగ్ వింటే చాలు... చాలామందికి అర్థమవుతుంది. సోషల్ మీడియాతో కుమారీ ఆంటీ పాపులర్ అయింది ఈ డైలాగ్ తోనే.

Food Business Kumari Aunty in TV serial
రెండు లివర్లు ఎక్స్ ట్రా… మొత్తం వెయ్యి రూపాయలు… ఈ డైలాగ్ వింటే చాలు… చాలామందికి అర్థమవుతుంది. సోషల్ మీడియాతో కుమారీ ఆంటీ పాపులర్ అయింది ఈ డైలాగ్ తోనే. దీన్ని సినిమాలు, సీరియల్స్, కామెడీ స్కిట్స్ లో ఎక్కడ పడితే అక్కడ వాడుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా ఫైన్ల విషయంలో ఈ డైలాగ్ వాడారంటే కుమారీ ఆంటీ (Kumari Aunty) క్రేజ్ మామూలుగా లేదు.
సోషల్ మీడియాతో పాపులర్ అయిన కుమారీ ఆంటీ ఇప్పుడు సీరియల్స్ (serials) లో కూడా కనిపించబోతోంది. మాదాపూర్ (Madapur) కేబుల్ బ్రిడ్జి దగ్గర స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసే ఆమె ఉన్నట్టుండి సెలబ్రిటీ అయింది. కుమారీ ఆంటీ ఇక బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. లేటెస్ట్ గా ఆమెకు ఓ సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. స్టార్ మా నిర్వహించే బీబీ ఉత్సవం కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చింది. షోలో పాల్గొన్న వాళ్ళందరికీ తన ఫుడ్ స్టాల్ నుంచే నాన్ వెజ్ భోజనం తీసుకొచ్చి వడ్డించింది కుమారీ ఆంటీ.
జీ తెలుగు (Zee Telugu) లో మధ్యాహ్నం మూడింటికి వచ్చే రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ( Rajeshwari Vilas Coffee Club) అనే సీరియల్ లో ఓ చిన్న గెస్ట్ రోల్ కోసం కుమారీ ఆంటీని రప్పించింది టీమ్. ఆ సీరియల్ లో తీసిన ఓ సీన్ ఇప్పుడు వైరల్ గా మారింది. కుమారీ ఆంటీకి ఉన్న పాపులారిటీని ఉపయోగించుకునేందుకు సీరియల్ లో అవకాశం ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోను జనంలోకి వదిలారు. ఇన్ స్టాలో ఈ వీడియోకు బోల్డన్ని వ్యూస్ తో పాటు లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి ఈ సీరియల్ తర్వాత కుమారీ ఆంటీకి బుల్లితెరపై అవకాశాలు పెరుగుతాయోమో చూడాలి.