1000 కోట్లకు… రూపాయి తగ్గినా వద్దంతే..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రజెంట్ వార్ 2 ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. డ్రాగన్ సెట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమౌతున్నాడు. ఆతర్వాతే దేవర 2 ని మొదలు పెట్టబోతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 22, 2025 | 06:46 PMLast Updated on: Mar 22, 2025 | 6:46 PM

For 1000 Crores Even If The Rupee Decreases It Wont Matter

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రజెంట్ వార్ 2 ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. డ్రాగన్ సెట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమౌతున్నాడు. ఆతర్వాతే దేవర 2 ని మొదలు పెట్టబోతున్నాడు. ఇది కాకుండా సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్టు తాలూకు టాక్స్ కూడా నడుస్తున్నాయి. జైలర్ ఫేం నెల్సన్ దిలీప్ కూడా ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. ఎలా చూసినా ఎన్టీఆర్ ప్లానింగ్ మొత్తం పాన్ ఇండియాని షేక్ చేసే కాంబినేషన్ మీదే ఉన్నట్టుంది. పాన్ ఇండియాని రెండు సార్లు షేక్ చేసిన తను, ఇక మీదట ఏం చేసినా పాన్ ఇండియా మూవీనే అవటం కామన్. కాని తన టార్గెట్ పాన్ ఇండియా కాదు.. మీనిమమ్ 1000 కోట్లు రాబట్టడం… ఆ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్ నే మించేలా తన కరీర్ ని డిజైన్ చేసుకుంటున్నాడు. కాకపోతే 1000 కోట్ల సినిమారావాలంటే రాదు… ఎవరి దగ్గర కూడా సక్సెస్ ఫార్ములా ఉండదు.. అయినా 1000 కోట్లకు దారి పట్టేశాడు ఎన్టీఆర్.. అదే ప్రీరిలిజ్ బిజినెస్… అక్కడే తోటి హీరోలంతా తారక్ ని చూసి షాక్ అవుతున్నారు. ఇంతకి ప్రీరిలీజ్ బిజినెస్ ఎలా ఓ సినిమా రేంజ్ ని 1000 కోట్లని తేలుస్తుంది? హావేలుక్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ త్రిబుల్ఆర్ తో 1350 కోట్లు రికార్డు సొంతం చేసుకున్నాడు. దేవరతో 670 కోట్ల హిట్ ని తన ఎకౌంట్ లో వేసుకున్నాడు. అలానే రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన తొలి హీరోగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇప్పుడు మరో రికార్డు తన ఎకౌంట్ లో పడుతోంది. అదే 1000 కోట్ల సినిమా..పాన్ ఇండియా హిట్లొచ్చాయి, రాజమౌళి లాంటి కటౌట్ సాయం లేకుండా పాన్ ఇండియా హిట్ మెట్టెక్కగలడని తారక్ ప్రూవ్ చేశాడు. ఇక మిగిలింది సోలోగా 1000 కోట్లు రాబట్టడం. అది కూడా చాలా తేలికని తన సినిమాలు రిలీజ్ కాకముందే తేల్చేస్తున్నాడు. అదే ఖాన్లు, కపూర్లనే కాదు మిగతా పాన్ ఇండియా హీరోలని కూడా పరేషాన్ చేసేలా ఉంది.

అదే ప్రీరిలీజ్ బిజినెస్ స్ట్రాటజీ… ఓ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ బట్టే దాని స్టామినా ఏంటో తెలుస్తుంది. అక్కడే మార్కులు కొట్టేస్తున్నాడు ఎన్టీఆర్. షారుఖ్ ఖాన్ నుంచి, సల్మాన్ వరకు రణ్ బీర్ కపూర్ నుంచి రణ్ వీర్ సింగ్ వరకు అందరి టార్గెట్ 1000 కోట్లే. అలాంటి కథ కావాలంటున్నారు. కాని ఏ కథ 1000 కోట్లు రాబడుతుందో ఎవరికీ ఆ ఫార్ములా తెలిసే ఛాన్స్ లేదు.అది ఎన్టీఆర్ కి కూడా వర్తిస్తుంది. కాని అక్కడే తారకమంత్రమేస్తున్నాడు. రిలీజ్ కి ముందే 1000 కోట్లకు దగ్గరలో ఏ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ చేసే ఛాన్స్ఉంది. అది తేలాలంటే కథ తో పాటు కాంబినేషన్ కూడా ముఖ్యమే…ఫర్ ఎగ్జాంపుల్ వార్ 2 కాంబినేషనే చూస్తే అర్ధమౌతుంది. బ్రహ్మస్త్ర తో పాన్ ఇండియా హిట్ కొట్టిన అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో గ్రీక్ గాడ్ హ్రితిక్ హీరోగా ఎన్టీఆర్ విలన్ గా సినిమా తెరకెక్కింది. ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్. బాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌజ్ యష్ రాజ్ బ్యానర్ లో వస్తోంది కాబట్టి, థియేట్రికల్ రిలీజ్ మతిపోగొట్టేలా ఉంది.

సో కథ ఏమాత్రం బాగున్నా వార్ 2 వెయ్యికోట్లు కాదు, రెండు వేల కోట్లు రాబట్టే సినిమా అవుతుంది. ఆల్రెడీ ప్రీరిలీజ్ బిజినెస్లే 1100 కోట్లు దాటింది. కాబట్టి వెయ్యికోట్ల లెక్కేకాదు. సో ఇక్కడ ఎన్టీఆర్ కాంబినేషన్ ఐడియా ఎలా వర్కవుట్ అయ్యిందో, డ్రాగన్ కి అలానే సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. డ్రాగన్ షూటింగ్ కాకముందే, ఓటీటీ రైట్స్ 310 కోట్లు, ఓవర్ సీస్ రైట్స్ 150 కోట్లని తేలింది. సౌత్ వర్షన్ కి కనీసం 250 కోట్ల వరకు థియేట్రికల్ రైట్సే వస్తాయని అంచనా ఉంది. ఇక నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ లెక్కేస్తే మినిమమ్ 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఛాన్స్ఉంది. దీనికి కారణం దేవర నార్త్ ఇండియాని ఊపేయటం. తెలుగు రాష్ట్రాల్లో తారక్ కి 200 కోట్ల మార్కెట్ మించి ఉండటం..

దీనికి తోడు కేజీయఫ్, సలార్ తో పాన్ ఇండియాని మూడు సార్లు షేక్ చేసిన ప్రశాంత్ నీల్ మేకింగ్ తో ఎన్టీఆర్ సినిమా చేస్తుండటం.. సో ఇలా కాంబినేషన్ తోనే తారక్ ప్రతీ మూవీ ప్రీరిలిజ్ బిజినెస్ వెయ్యికోట్లను దాటుతోంది. కాబట్టి తనేం చేసినా అది వెయ్యికోట్ల మూవీగా మారుతోందని ఇలా కన్ఫామ్ అవుతోంది. హిట్ మూవీకి సీక్వెల్ ఏదైనా 1000 కోట్లు దాటేస్తుందని, బాహుబలి 2, పుష్ప2, కేజీయఫ్ 2 ప్రూవ్ చేశాయి. కాబట్టి దేవర 2 కూడా వెయ్యికోట్ల పైనే రాబడుతుందనే అంచనాలున్నాయి. సో ఎలా చూసినా ఎన్టీఆర్ కి వెయ్యికోట్లు రాబట్టే మూడు సినిమాలు కన్ఫామ్ అయినట్టే.