Kalki 2898AD : ఫస్ట్ సింగిల్ లోడింగ్

ప్రస్తుతం పెద్ద సినిమాలు లేక క్లోజ్ అయిన సింగిల్ స్క్రీన్ థియేటర్లు.. మరో ఆరు వారాల్లో కిక్కిరిసిపోనున్నాయి. అసలు కల్కి సినిమా మే 9న రిలీజ్ అయి ఉంటే, ఈపాటికే థియేటర్లు కళకళలాడుతు ఉండేవి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 17, 2024 | 11:00 AMLast Updated on: May 17, 2024 | 11:00 AM

For Big Movies Or Closed Single Screen Theatres

ప్రస్తుతం పెద్ద సినిమాలు లేక క్లోజ్ అయిన సింగిల్ స్క్రీన్ థియేటర్లు.. మరో ఆరు వారాల్లో కిక్కిరిసిపోనున్నాయి. అసలు కల్కి సినిమా మే 9న రిలీజ్ అయి ఉంటే, ఈపాటికే థియేటర్లు కళకళలాడుతు ఉండేవి. కానీ ఎన్నికల నేపథ్యంలో జూన్ 27కి కల్కి సినిమాను వాయిదా వేశారు. ఇక ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు కల్కి మేకర్స్. ఈ క్రమంలో ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

వాస్తవానికైతే.. కొద్ది రోజుల క్రితమే కల్కి ఫస్ట్ సింగిల్ విడుదల కానుందని వినిపించింది. కానీ రిలీజ్‌కు మూడు నెలల ముందే పుష్ప2 సాంగ్ రిలీజ్ అయింది. ఇక ఐదు నెలల సమయం ఉండగానే దేవర ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతోంది. కానీ రిలీజ్‌కు నెలన్నర సమయం కూడా లేని కల్కి ఫస్ట్ సింగిల్ మాత్రం రిలీజ్ కాలేదు. అందుకే.. ఇప్పుడు ఫస్ట్ సాంగ్‌తో ప్రొమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే కల్కి గ్లింప్స్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు. దీంతో ఫస్ట్ సాంగ్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

వీలైనంత త్వరగా ఈ సాంగ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమాను నాగ్ అశ్విన్ విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తుండగా.. వైజయంతీ మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తుండగా.. దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరి కల్కి ఎలా ఉంటుందో చూడాలి.