గోపిచంద్ కోసం.. పూరి స్టోరీ రెడీ.. అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే…
లైగర్, డబల్ ఇస్మార్ట్ సినిమాలతో వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఇప్పుడు ఏ హీరోతో సినిమా చేయాలి అనేదానిపై క్లారిటీకి రావడం లేదు.

లైగర్, డబల్ ఇస్మార్ట్ సినిమాలతో వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఇప్పుడు ఏ హీరోతో సినిమా చేయాలి అనేదానిపై క్లారిటీకి రావడం లేదు. ముగ్గురు, నలుగురు హీరోలకు కథలు చెప్పినా సరే ఎవరు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవ్వకపోవడంతో… పూరి జగన్నాథ్ ప్లాన్ ఏంటి అనేది క్లారిటీ లేదు. ఇక పూరి అభిమానులైతే పూరి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని మంచి హిట్టు కొట్టాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలకు మంచి హిట్లు ఇచ్చి.. వాళ్ల కెరీర్ రూట్ మార్చిన పూరి జగన్నాథ్.. ఇప్పుడు ఒక హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు.
ఒకప్పుడు కథలేకపోయినా సరే హిట్టు కొట్టిన పూరి జగన్నాథ్.. ఇప్పుడు సరైన కథలు సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాడని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఇక పూరి జగన్నాథ్ రీసెంట్ గా అక్కినేని అఖిల్.. కోసం ఒక పవర్ఫుల్ కథ రెడీ చేసి వినిపించాడు. అయితే ఆ కథ నాగార్జునకు అంతగా నచ్చలేదు. ప్రస్తుతం అఖిల్ రిస్క్ చేసే పొజిషన్లో లేకపోవడంతో కాస్త జాగ్రత్త పడుతున్నట్లు కనపడుతుంది. దీనితోనే పూరి జగన్నాథ్ కథను పక్కనపెట్టాడు. ఇక ఎన్టీఆర్ కోసం కూడా ఒక కథ రాస్తే.. ఎన్టీఆర్ ఇప్పట్లో ఫ్రీ అయ్యే ఛాన్స్ లేదు.
అందుకే ఆ కథను పక్కన పెట్టేసాడని అంటున్నారు. ఇక నాగచైతన్య కోసం కూడా ఒక కథ రాశాడని.. అగ్రెసివ్ గా ఉండే నాగచైతన్యకు ఆ కథ బాగుంటుందని పూరి ప్లాన్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ కథ కూడా అతను ఓకే చెప్పలేదు. ఇక గోపీచంద్ కోసం ఒక కథ రెడీ చేసి పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ కథ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. గోపీచంద్ కూడా ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో విలన్ పాత్రలు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని వార్తలు వచ్చాయి.
ఇక పూరి జగన్నాథ్ గోపీచంద్ కోసం మంచి కథ రెడీ చేసి పెట్టుకున్నాడని, ఆ కథను గోపీచంద్ కు వినిపించగా నచ్చిందని టాక్. వీళ్ళ కాంబినేషన్లో 2010లో గోలీమార్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా బాగానే ఆకట్టుకుంది. ఇక గోపీచంద్ చివరి మూడు సినిమాలు.. రామబాణం, భీమా, విశ్వం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీనితో గోపీచంద్ ఇప్పుడు మంచి స్టోరీ కోసం ఎదురు చూస్తున్నాడు. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించే ఛాన్స్ ఉంది. ఈ సినిమాతో అయినా పూరి జగన్నాథ్ మంచి కం బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ఇంకా గోపీచంద్ కూడా హీరో పాత్రలే కాకుండా వేరే పాత్రలు కూడా చేయాలని డిసైడ్ అయినట్లు టాక్. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ కు విలన్ గా గోపిచంద్ ను రిఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి.