Gadar 2: బాహుబలి కోటని బద్దలు కొడుతున్న బాలీవుడ్ హీరో..!

ఆల్రెడీ కేజీయఫ్-2 హిందీ కలెక్సన్స్ రూ.435 కోట్ల రికార్డుని బ్రేక్ చేసింది గదర్ 2. అలా ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత మిగిలింది బాహుబలి 2, పటాన్ రికార్డులే. అసలే బాహుబలి 2 రికార్డులని హిందీ జనం బ్రేక్ చేయలేరనుకుంటే.. ఈఏడాదే పఠాన్ హిట్‌తో షారుఖ్ ఖాన్ షాక్ ఇచ్చాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 28, 2023 | 08:08 PMLast Updated on: Aug 28, 2023 | 8:08 PM

Gadar 2 Will Going To Break Bahubali 2 Records Soon

Gadar 2: బాహుబలి 2 మూవీ హిందీలో కలెక్ట్ చేసిన వసూళ్లని బాలీవుడ్ మూవీ గదర్ 2 బ్రేక్ చేసేలా ఉంది. ఆల్రెడీ కేజీయఫ్-2 హిందీ కలెక్సన్స్ రూ.435 కోట్ల రికార్డుని బ్రేక్ చేసింది గదర్ 2. అలా ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత మిగిలింది బాహుబలి 2, పటాన్ రికార్డులే. అసలే బాహుబలి 2 రికార్డులని హిందీ జనం బ్రేక్ చేయలేరనుకుంటే.. ఈఏడాదే పఠాన్ హిట్‌తో షారుఖ్ ఖాన్ షాక్ ఇచ్చాడు. బాహబులి 2 హిందీలో రాబట్టిన టోటల్ కలెక్షన్స్ రూ.510 కోట్లని పటాన్ మూవీ బ్రేక్ చేసింది.

రూ.వెయ్యికోట్ల మూవీగా నిలిచింది పఠాన్. కట్ చేస్తే ఈ ఏడాది ఇలా సెన్సేషన్ క్రియేట్ చేసిన పఠాన్ తర్వాత ఆ పని గదర్-2 చేసేలా ఉంది. గదర్ 2 మంగళవారం వచ్చే వసూళ్లని కూడా కలిపితే 550 కోట్లు రీచ్ అవ్వొచ్చని తెలుస్తంది. అంటే బుధవారం లేదంటే గురువారంలోగా బాహుబలి 2 రికార్డుని గదర్ 2 మూవీ బ్రేక్ చేయటం ఖాయమైనట్టే. దీంతో ఒకే ఏడాది రెండు హిందీ సినిమాలు బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేసినట్టౌతుంది. అదే జరిగితే బాలీవుడ్‌ని ఆపటం కష్టమే. అసలే సింగిల్ హిట్ పడితే ఆగని బీటౌన్ స్టార్స్ బాహుబలి 2 రికార్డుని రెండు సార్లు బ్రేక్ చేస్తే మళ్లీ చెట్టెక్కి కూర్చుంటారు. అదే జరిగేలా ఉందంటున్నారు ‌ట్రేడ్ పండితులు.