Ram Charan: రామ్ చరణ్ ని తగ్గమన్న డైరెక్టర్ శంకర్.. ఇండస్ట్రీ షాక్ ..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఫోకస్ అయ్యాడు. నాటు పాటతో త్రిబుల్ ఆర్ హిట్ వల్ల తారక్ తోపాటు చరణ్ కూడా వరల్డ్ వైడ్ గా వెలిగిపోతున్నాడు. అలాంటి హీరోని ఇప్పుడు తగ్గమని తేల్చేశాడు శంకర్. ఈ దర్శకుడు రాజమౌళికంటేముందే ఎన్నో వండర్స్ క్రియోట్ చేసుండొచ్చు. కాని మెగా వారసుడు మెగా పవర్ ఫుల్ స్టార్ అయిన చరణ్ ని తగ్గమనటం, అది కూడా గేమ్ చేంజర్ మూవీ విషయంలో ఈ చర్చ రావటం జరిగిందట.

Mega Power Star Ram Charan
గేమ్ ఛేంజర్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాల్సిందే అని చరణ్ పట్టుబడుతున్నాడని. దిల్ రాజు కూడా అందుకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఐతే భారతీయుడు 2 రిలీజ్అయ్యాకే గేమ్ ఛేంజర్ విడుదలవ్వాలని శంకర్ వాదిస్తున్నాడట.
సంక్రాంతికి భారతీయుడు 2, సమ్మర్ కి గేమ్ ఛేంజర్ రిలీజ్అవ్వాలనేది శంకర్ నిర్ణయం అని తెలుస్తోంది. కాని రామ్ చరణ్, దిల్ రాజు మాత్రం సంక్రాతికి రిలీజ్ చేయాలనే పట్టుబట్టడంతో, చరణ్ కి తేల్చి చెప్పాడట శంకర్. భారతీయుడు 2 మాతరమే పొంగల్ కి రిలీజ్ అనే శంకర్ నిర్ణయమే చరణ్ ని నచ్చట్లేదని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.