గేమ్ ఛేంజర్ సెన్సార్ రివ్యూ.. రామ్ చరణ్ కెరీర్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సీనియర్ అండ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. మూడేళ్ల నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు ఈ ఫస్ట్ రివ్యూ మింగుడు పడటం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 7, 2025 | 03:57 PMLast Updated on: Jan 07, 2025 | 3:57 PM

Game Changer Censor Review Ram Charans Career

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సీనియర్ అండ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. మూడేళ్ల నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు ఈ ఫస్ట్ రివ్యూ మింగుడు పడటం లేదు. సినిమా ట్రైలర్ అలాగే వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమాపై ఓ రేంజ్ లో క్రేజ్ పెంచితే లేటెస్ట్ గా వచ్చిన ఫస్ట్ రివ్యూ మాత్రం మెగా అభిమానులకు రక్త కన్నీరు కారేలా చేస్తోంది. యూట్యూబ్ లో టాప్ ట్రేండింగ్ లో ఉన్న గేమ్ చేంజ్ ట్రైలర్ సినిమాపై నేషనల్ వైడ్ గా హైప్ పెంచుతుంది.

ఇక లేటెస్ట్ గా ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ లో ఒకరు, సౌత్ ఇండియా ఫిలిం క్రిటిక్ గా చెప్పుకునే ఉమైర్ సందు.. ఎక్స్ లో కొన్ని సెన్సేషనల్ పోస్టులు పెట్టాడు. ఓవర్సీస్ సెన్సార్లో ఈ సినిమా చూసిన సందు గేమ్ చేంజర్ సినిమాపై సెన్సేషనల్ రివ్యూ లు ఇచ్చాడు. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు నుంచి గేమ్ చేంజర్ ఫస్ట్ రివ్యూ అంటూ పోస్ట్ చేసిన సందు ఇది అస్సలు వర్కౌట్ కాలేదని, శంకర్.. రామ్ చరణ్ మూవీ ఏమాత్రం చూసే విధంగా లేదంటూ కామెంట్ చేశాడు. మెయిన్ లీడ్ యాక్టర్స్ అంతా క్రింజ్, పూర్ పెర్ఫార్మన్స్ ఇచ్చారంటూ కామెంట్ చేశాడు.

అవుట్ డేటెడ్ స్టోరీ అని స్క్రీన్ ప్లే డైలాగ్స్ తో బోరింగ్ గా ఉందని రామ్ చరణ్ అభిమానులకు సారీ చెప్పాడు. ఈ సినిమా ఒక టార్చర్ అంటూ ఎక్స్ లో పోస్టులు పెట్టాడు. కేవలం 2 స్టార్ రేటింగ్ మాత్రమే ఇవ్వడం సెన్సేషన్. ఇక మరో పోస్ట్ పెట్టిన సందు… డైరెక్టర్ శంకర్ కచ్చితంగా సినిమాల నుంచి రిటైర్ కావాలని మీ 80, 90ల కాలంనాటి చెత్త సినిమాలు పొలిటికల్ సినిమాలు చూసి విసిగిపోయామని… మొదట ఇండియన్ 2, ఇప్పుడు గేమ్ చేంజర్… నువ్వు జనాలకు టార్చర్ డైరెక్టర్.. అతన్ని బ్యాన్ చేయండి అంటూ సెన్సేషనల్ పోస్టులు పెట్టాడు.

నువ్వు కమలహాసన్, రామ్ చరణ్ ల కెరీర్లు నాశనం చేశావని సందు రాసుకొచ్చాడు. గేమ్ చేంజర్ ట్రైలర్ క్రింజ్ చాలా చెత్తగా ఉందని… ఒక సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అంటూ కామెంట్ చేశాడు. నేను గేమ్ చేంజర్ సెన్సార్ స్క్రీనింగ్ లో పడుకొని పోయానని రాసుకొచ్చాడు. చెత్త నీచాతి నీచమైన 90 ల కాలం నాటి అవుట్ డేటెడ్ సినిమా అని మరొక పోస్ట్ పెట్టి నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. గేమ్ చేంజర్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ డిజాస్టర్ గా ఉన్నాయని ముఖ్యంగా ఓవర్సీస్ లో అతిపెద్ద మార్కెట్ అయినా యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్… అసలు లేవని సో కాల్డ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డం చూడండి అంటూ నవ్వుతున్న ఎమోజీలు పోస్ట్ చేశాడు. దీనితో మెగా ఫాన్స్ ఫైర్ అయిపోతున్నారు. గతంలో ఇతను చేసిన కామెంట్స్ కొన్ని ప్రూవ్ అయితే.. కొన్ని రాంగ్ అయ్యాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.