కన్నడోళ్ళు కుళ్ళుకోవడమే.. బెంగళూరులో గేమ్ చేంజర్ డామినేషన్

టాలీవుడ్ లో ఇప్పుడు గేమ్ చేంజర్ మేనియా మెయిన్ గా నడుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ మెగా ఫాన్స్ తో పాటుగా నార్మల్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 9, 2025 | 05:38 PMLast Updated on: Jan 09, 2025 | 5:38 PM

Game Changer Domination In Bengaluru

టాలీవుడ్ లో ఇప్పుడు గేమ్ చేంజర్ మేనియా మెయిన్ గా నడుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ మెగా ఫాన్స్ తో పాటుగా నార్మల్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఏడేళ్ల తర్వాత చేస్తున్న సోలో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫాన్స్. యాక్టింగ్ విషయంలో ఇప్పటికే తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకున్న రాంచరణ్ ఏ సినిమాతో కచ్చితంగా రికార్డులు బ్రేక్ చేస్తాడని.. యాక్షన్ లో కూడా రామ్ చరణ్ కచ్చితంగా దుమ్ము రేపుతాడంటూ కాలర్ ఎగరేస్తున్నారు ఫ్యాన్స్.

ఇక బయటికి వచ్చిన టీజర్, ట్రైలర్ అన్ని కూడా సినిమాపై అంచనాలు భారీగా పెంచుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నీ కూడా సినిమాపై క్రేజ్ పెంచాయి. ఇక సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సినిమాకు భారీగా బజ్ క్రియేట్ అయింది. లేటెస్ట్ గా కర్ణాటకలో ఈ సినిమాపై ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ఒక రీల్ వైరల్ అవుతుంది. బెంగళూరులోని బృందా ధియేటర్ దగ్గర రామ్ చరణ్ నటించిన సినిమాలకు సంబంధించిన ప్రతి కటౌట్ ను ఏర్పాటు చేశారు.

చిరుత సినిమా దగ్గరనుంచి మగధీర అలాగే ఆరెంజ్, నాయక్, తుఫాన్, ఎవడు, వినయ విధేయ రామ, రంగస్థలం, ధ్రువ, ఆర్ఆర్ఆర్, గేమ్ చేంజర్.. ఇలా ప్రతి సినిమా కటౌట్ ని అక్కడ ప్లేస్ చేశారు. మామూలుగా తెలుగు హీరోకి తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఉంటే అది నార్మల్ విషయం. తెలుగు హీరోకు వేరే భాషలో క్రేజ్ ఉంటే దానికి ఓ రేంజ్ ఉంటుంది అని ఇప్పుడు రామ్ చరణ్ ప్రూవ్ చేశాడు. ఇప్పుడు మన తెలుగు సినిమా ఎక్కువగా కన్నడ మార్కెట్ పై కూడా ఫోకస్ పెడుతుంది. కన్నడ వాళ్ళు కూడా తెలుగు పై ఫోకస్ పెట్టడంతో మనవాళ్లు ఛాన్స్ వదులుకోవటం లేదు.

అక్కడ గ్రాండ్ గా సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా దేవర, పుష్ప సినిమాలను కూడా అక్కడ గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇక ప్రభాస్ కూడా తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో కర్ణాటక మీద గట్టి ఫోకస్ చేశాడు. కర్ణాటక టాప్ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ హోంబలే.. ఫిలిమ్స్ బ్యానర్ లో ప్రభాస్ మూడు సినిమాలు చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ కూడా కర్ణాటక పై ఎక్కువ ఫోకస్ పెట్టి తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా పుష్ప సినిమా అయితే కర్ణాటకలో రికార్డులు బ్రేక్ చేస్తుంది అని కూడా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ధైర్యంగా చెప్పారు. కానీ బెంగళూరులో మాత్రమే పుష్ప క్రేజ్ కనపడింది. మరి కన్నడలో గేమ్ చేంజర్ సినిమా ఏ రేంజ్ లో రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. పుష్ప పార్ట్ 2 ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్ విషయంలో కాస్త స్పీడ్ గా కనిపించింది. అయితే ఆ రేంజ్ లో గేమ్ చేంజర్ కనపడటం లేదు.