నందమూరి నటసింహం హీరోగా బాబి కొల్లి డైరెక్షన్లో వస్తున్న డాకు మహారాజ్ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది. అమెరికాలోని డల్లాస్ లో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశా.రు బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబి డియోల్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ కూడా గ్రాండ్ గానే జరుగుతున్నాయి. త్వరలోనే అనంతపురంలో మంత్రి నారా లోకేష్ చీఫ్ గెస్ట్ గా ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు. ట్రైలర్ లో కొన్ని సీన్లు నందమూరి ఫ్యాన్స్ కు బాగా నచ్చాయి. ఆ సీన్లు చూసిన ఫాన్స్.. డాకు మహారాజ్ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. బాలకృష్ణ క్యారెక్టర్జేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయని.. యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ తో కలిపి డాకు మహారాజ్ సినిమా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడం ఖాయం అని సినిమా యూనిట్ కూడా దీమాగా ఉంది. అయితే ఇప్పుడు ఈ ట్రైలర్ కట్ విషయంలో నందమూరి ఫ్యాన్స్ కాస్త సీరియస్ గా ఉన్నారు. వాస్తవానికి బాలకృష్ణ సినిమాలకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయితే అందులో బాలయ్య డైలాగ్స్ ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంటాయి. గతంలో ఏ సినిమా చూసుకున్నా సరే బాలయ్య డైలాగ్స్ తోనే ఎక్కువగా ట్రైలర్లు కట్ చేశారు. కానీ డాకు మహారాజ్ విషయంలో మాత్రం బాలకృష్ణ డైలాగులు పెద్దగా లేవు. ఒకటి రెండు డైలాగ్స్ తోనే ట్రైలర్ కంప్లీట్ అయింది. దీన్ని చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కాస్త డైరెక్టర్ పై ఫైర్ అవుతున్నారు. దాదాపు బాలకృష్ణ హీరోగా రెండేళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా వేరే లెవెల్ లో ఉన్నాయి. అలాంటప్పుడు ట్రైలర్ కట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ జాగ్రత్తలు తీసుకోలేదని ఫాన్స్ బూతులు తిడుతున్నారు. వాస్తవానికి ట్రైలర్ ను కట్ చేసింది గేమ్ చేంజర్ సినిమా ఎడిటర్. ఈ విషయంలో ఎప్పటికి డైరెక్టర్ బాబి కొల్లి కూడా సోషల్ మీడియాలో థాంక్స్ చెప్పాడు. కావాలనే ట్రైలర్లో బాలకృష్ణ డైలాగులు లేకుండా ట్రైలర్ కట్ చేశారని . గేమ్ చేంజర్ సినిమా యూనిట్ సినిమాపై కుట్ర చేసిందంటూ కొంతమంది కామెంట్ చేయడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు బాలకృష్ణ సినిమాలు చూసేదే ఆయన డైలాగులు కోసం అలాంటిది బాలయ్య డైలాగులు లేకుండా ట్రైలర్ ఎలా రిలీజ్ చేశారంటూ సినిమా యూనిట్ పై కూడా ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాకు ఎడిటర్ ఉన్నప్పుడు వేరే ఎడిటర్ తో ట్రైలర్ ఏ విధంగా కట్ చేయించారంటూ డైరెక్టర్ ను బూతులు తిడుతున్నారు. వాస్తవానికి ట్రైలర్ చాలా బాగుంది కానీ డైలాగులు లేకపోవడం మైనస్ అయింది. అయితే అనంతపురంలో రిలీజ్ చేసే ట్రైలర్ వేరే ఉందని అందులో డైలాగులు ఉంటాయని మేకర్స్ చెప్తున్నారు.[embed]https://www.youtube.com/watch?v=5p9KM9K07cs[/embed]