గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. గేమ్ చేంజర్.. సినిమా కోసం మెగా అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. దాదాపు మూడేళ్ల నుంచి ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. కానీ సినిమా మాత్రం రిలీజ్ కాలేదు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న... గేమ్ చేంజర్ సినిమాపై తమిళంలో కూడా క్రేజ్ ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయంలో ఫ్యాన్స్ కూడా కాస్త అప్సెట్ అయ్యారు. ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చారు. ఒకవైపు స్టార్ హీరోల సినిమాలన్నీ విడుదలవుతుంటే రామ్ చరణ్ సినిమా మాత్రం లేట్ అవ్వడాన్ని మెగా అభిమానులు ఏమాత్రం కూడా డైజెస్ట్ చేసుకోలేదు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఫైనల్ గా రిలీజ్ అవ్వడానికి రెడీ అయిపోయింది. ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా ఓ రేంజ్ లో చేస్తున్నారు మేకర్స్. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను ప్లాన్ చేశాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రలో కనబడతాడు అని తెలుస్తుంది. ఒకటి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర కాక మరొకటి ఐఏఎస్ పాత్ర అని ముందు టాక్ వచ్చింది. అయితే ఇప్పుడొస్తున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రామ్ చరణ్ ఈ సినిమాలో ఐపీఎస్ గా కనబడుతున్నట్లు తెలుస్తోంది. దీనితో అసలు శంకర్ ప్లానింగ్ ఏంటి అనేది అభిమానులకు పిచ్చెక్కిపోతోంది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ తో ఈ విషయం క్లారిటీ వచ్చింది. ఇప్పటికే సినిమా గురించి వస్తున్న కొన్ని న్యూస్ లు అభిమానులకు చెమటలు పట్టిస్తున్నాయి. కచ్చితంగా రికార్డులు బద్దలు కొడతామని సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి తొడకొడతామని మెగా ఫాన్స్ ధీమాగా ఉన్నారు. గేమ్ చేంజర్ సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలు రిలీజ్ లు ఉన్నా సరే ఎక్కడ మెగా ఫాన్స్ లో భయం కనబడటం లేదు. ఇక లేటెస్ట్ గా ఒక అప్డేట్ వచ్చింది. గేమ్ చేంజర్ మూవీ డ్యూరేషన్ పై క్లారిటీ వచ్చింది. గేమ్ చేంజర్ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చేసింది. మొత్తం మూవీ టైం 2 గంటల 45 నిమిషాల 30 సెకండ్లు. ఈ సినిమాలో పలు మార్పులు కూడా చేయాలని సెన్సార్ బోర్డు సూచించింది. లిక్కర్ లేబల్స్ ను గ్రాఫిక్స్ తో కవర్ చేయడం అలాగే కొన్ని డైలాగులకు ప్రత్యామ్నాయ పదాలు వాడాలని ఒక పేరు మార్పుతో పాటుగా టైటిల్స్ లో పద్మశ్రీ అనే పదాన్ని కూడా తొలగించాలని సూచించింది. పద్మశ్రీ అనే పదం గతంలో కూడా వివాదం అయింది. మహేష్ బాబు దూకుడు సినిమాలో బ్రహ్మానందం పేరు పద్మశ్రీ. ఆ తర్వాత దీనిపై విమర్శలు వచ్చాయి. అప్పటినుంచి ఆ పేరుని సినిమాల్లో వాడాలి అంటే కాస్త భయపడుతున్నారు. ఇక ఇప్పుడు సెన్సార్ బోర్డు ఈ సినిమాలో అదే పేరు ఉండటంతో తొలగించాలని సూచించింది.[embed]https://www.youtube.com/watch?v=EYTi9sQ_2MM[/embed]