అమెజాన్ ప్రైమ్ లో గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ అదే.. పాపం దిల్ రాజు…!

భారీ అంచనాలతో రిలీజ్ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా మిక్స్డ్ టాక్ తో ఆడుతోంది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న మెగా ఫాన్స్ కు నిరాశ ఎదురయిందని చెప్పాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 11, 2025 | 07:50 PMLast Updated on: Jan 11, 2025 | 7:50 PM

Game Changer Release Date On Amazon Prime Is The Same

భారీ అంచనాలతో రిలీజ్ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా మిక్స్డ్ టాక్ తో ఆడుతోంది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న మెగా ఫాన్స్ కు నిరాశ ఎదురయిందని చెప్పాలి. సినిమా వసూళ్లు కూడా పెద్దగా సాధించినట్లు కనపడటం లేదు. దీనితో మూవీ మేకర్స్ కూడా పెద్దగా హడావిడి చేయడం లేదు. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా సాధ్యం కాదు అనే ఒపీనియన్స్ వినపడుతున్నాయి. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేసిన ఈ సినిమా కనీసం 250 కోట్లు వసూలు చేయడం కూడా కష్టమే అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

అభిమానులు మాత్రం రామ్ చరణ్ నటన బాగుందని ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియన్ 2 డిజాస్టర్ తో చతికిలబడ్డ శంకర్ సినిమాతోనైనా గట్టి కం బ్యాక్ ఇస్తాడని ఎదురు చూశారు. కానీ అది అయ్యే పనిలా కనబడటం లేదు. దాదాపు సినిమాకు 200 కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని అంచనాలు కూడా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాదాపు 100 కోట్లకు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.

థియేటర్ లో రిలీజ్ అయిన 8 వారాల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెగిటివ్ టాక్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం కచ్చితంగా ఓటీటీలో నెల రోజుల్లోనే రిలీజ్ అవ్వడం ఖాయమని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటన చాలా బాగున్నా సరే సినిమాలో పట్టు లేకపోవడంతో షాక్ అవుతున్నారు ఆడియన్స్. కథ కూడా పాతదే అనే ఒపీనియన్స్ ఎక్కువగా వినపడుతున్నాయి. సాంగ్స్ మీద పెట్టిన దృష్టి కథ మీద పెట్టి ఉంటే కచ్చితంగా సినిమా సూపర్ హిట్ కొట్టి ఉండేది.

దాదాపుగా 60 నుంచి 70 కోట్లు సాంగ్స్ మీద బడ్జెట్ పెట్టారు మేకర్స్. సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ కు కూడా భారీగానే ఖర్చు చేశారు దిల్ రాజు. అమెరికాలో గట్టిగా ఈవెంట్స్ ప్లాన్ చేయడంతో భారీగా ఖర్చయింది. ఇక తర్వాత రాజమండ్రిలో కూడా భారీగానే ఖర్చు పెట్టారు. కానీ సినిమాకు మాత్రం అనుకున్న స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో ఒక్క రికార్డు కూడా ఈ సినిమా బ్రేక్ చేయకపోవడంతో ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అల్లు అర్జున్ కు షాక్ ఇవ్వొచ్చని మెగా ఫాన్స్ ధీమాగా ఉంటే అనుకున్న రేంజ్ లో సినిమా ఆడక పోవడంతో సోషల్ మీడియాలో కూడా పెద్దగా కామెంట్స్ చేయడం లేదు. మరి అమెజాన్ ప్రైమ్ లో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.