Ramcharan : ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అప్పుడేనా..?

ఆర్ ఆర్ ఆర్‌ (RRR) తో గ్లోబ‌ల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్ (Mega Power Star) రాం చ‌ర‌ణ్ (Ram Charan).. ప్ర‌స్తుతం భారీ సినిమాల ద‌ర్శ‌కుడు శంక‌ర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు.. గేమ్ ఛేంజ‌ర్‌ (Game Changer) గా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 16, 2024 | 10:05 AMLast Updated on: Feb 16, 2024 | 10:05 AM

Game Changer Release Just Now

ఆర్ ఆర్ ఆర్‌ (RRR) తో గ్లోబ‌ల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్ (Mega Power Star) రాం చ‌ర‌ణ్ (Ram Charan).. ప్ర‌స్తుతం భారీ సినిమాల ద‌ర్శ‌కుడు శంక‌ర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు.. గేమ్ ఛేంజ‌ర్‌ (Game Changer) గా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక‌.. చెర్రీ-శంక‌ర్ (Cherry-Shankar) కాంబోలో వ‌స్తున్న ఈ మూవీపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచ‌నాలున్నాయి.

ఇక లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం రేపటి నుండి హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City) లో తాజా షెడ్యూల్ జరగనుండగా ఇందులో యువ ఫైట్ మాస్టర్స్ అన్బు అరివు నేతృత్వంలో భారీ యాక్షన్ ఫైట్ చిత్రీకరించనున్నారట.. ఇక‌.. ఈ మూవీ ఎప్పుడు వ‌స్తుందో తెలియ‌ని సందిగ్ధంలో ఉన్న ఫ్యాన్స్‌కు కాస్త రిలీఫ్ ఇచ్చే న్యూస్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది.. ఈ ఏడాది గేమ్ ఛేంజర్ ని ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.. దీంతో.. మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఇక రామ్ చరణ్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. చెర్రీ తన 16 వ సినిమాను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఓ సినిమాను కమిట్ అయ్యాడు.. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హిందీ హీరో టైగర్ ష్రాఫ్ నటించనుండని తెలుస్తోంది. టైగర్ ష్రాఫ్ ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారట. ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట.. ఏది ఏమైనా ట్రిపుల్ ఆర్ తీసుకొచ్చిన క్రేజ్‌తో చెర్రీ సినిమాల ఎంపిక‌లో జాగ్ర‌త్తలు తీసుకుంటూ త‌న ఇమేజ్‌కు త‌గ్గ సినిమాలు సెల‌క్ట్ చేసుకుంటున్నాడంటున్నారు ఫ్యాన్స్..