గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిపొయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ కు చాలానే హోప్స్ ఉన్నాయి. విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ప్లాన్ చేసారు నిర్మాతలు. బడ్జెట్ విషయంలో డైరెక్టర్ ఎంత అడిగితే అంత ఇచ్చేసారు. మరి సినిమా ఎలా ఉంది...? అంచనాలకు తగ్గట్టు ఉందా...? శంకర్ మార్క్ కనపడిందా...? రామ్ చరణ్ డ్యూయల్ రోల్ ఎలా ఉంది...? ఒకసారి రివ్యూలో చూద్దాం. ఐపీఎస్ ఆఫీసర్ రామ్నంందన్ (రామ్చ రణ్ ) కు ఐఏఎస్ కావాలనేది కల. కష్టపడి.. సివిల్స్ పరీక్ష పట్టుదలగా రాసి ఐఏఎస్ అవుతాడు. అవినీతి లేకుండా చేయాలన్నదే రామ్ కల. అందుకే కలెక్టర్ అయిన వెంటనే అవినీతినే టార్గెట్ చేస్తాడు. అప్పటి వరకు దౌర్జన్యాలు చేసే రౌడీ లకు, అవినీతి చేసే అధికారులకు, అక్రమాలు చేసే వ్యాపారులకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక దీపికతో రామ్ చరణ్ కు బ్రేకప్ అయి ఉంటుంది. ఇద్దరూ మళ్ళీ ఎదురుపడటం జరుగుతుంది. ఇక ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్).. అధికారంలో ఉంటే నిజాయితీగా ఉండాలనుకునే నాయకుడు. చివరి సంవత్సరం అందరూ నిజాయితీగా ఉండాలని అవినీతి మానేయాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్పష్టంగా చెప్తాడు. గతంలో తాను అప్పన్న (రామ్చదరణ్)కు పొడిచిన వెన్నుపోటును, అన్యాయాన్ని తలచుకొని కుమిలిపోతూ ఉంటాడు. తండ్రి ఉన్న సీఎం సీటుపైనే ఆశలు పెట్టుకున్న మంత్రి బొబ్బిలి మోపిదేవి (ఎస్జేు సూర్య)కు ఇది అసలు నచ్చేది కాదు. మరోవైపు కలెక్టర్ రామ్నంమదన్ కూడా మోపిదేవి దందాలను ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కుట్రలతో సీఎం కుర్చీపై కూర్చున్న మోపిదేవిని రామ్ చరణ్ అడ్డుకుంటాడు. ఆ తర్వాత సత్యమూర్తి చివరి కోరికతో ఒక భారీ ట్విస్ట్ ఉంటుంది. రామ్ నందన్ కు గతం గురించి రివీల్ కావడం.. ఆ తర్వాత ఎన్నికలు రావడం.. వాటిని కలెక్టర్ ఎలా ఆపాడు.. అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటీ.. అప్పన్న, పార్వతి (అంజలి) చేసిన పోరాటం ఏంటీ అనేవి ఈ సినిమాలో హైలెట్. కథ పాతదే.. మెరపులు రోబో తర్వాత శంకర్ కు ఆ రేంజ్ హిట్ ఇప్పటి వరకు రాలేదు. ప్రయోగాలు చేయడంలో దిట్ట అయిన శంకర్.. ఫెయిల్ అవుతూ వస్తున్నారు. అయితే ఈ సినిమాకు కథ పూర్తిగా తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఇచ్చారు. దీనితో కథపై ఇంట్రస్ట్ పెరిగింది. కాని అనుకున్న రేంజ్ లో కొత్త మార్క్ ఏం కనపడలేదు అనే చెప్పాలి. అవినీతిని ఐఏఎస్ అధికారి అడ్డుకోవడం, రాజకీయ ఎత్తులు, కూర్చీ కోసం ఆరాటం, వెన్నుపోటు పొడవడం.. ఇవన్నీ ఇప్పటికే జనాలు చూసారు. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. అక్కడక్కడా ఇంట్రస్టింగ్ గా బాగుంటుంది. సూపర్ కాదు గాని ఓకే పర్వాలేదు చూడొచ్చు అన్నట్టే ఉంది. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే రొటీన్ గానే స్టార్ట్ చేసారు గాని.. మాస్ యాక్షన్ బాగుంటుంది. పొలిటికల్ యాంగిల్ పరిచయం చేసి ఆ తర్వాత హీరో పాత్రను పరిచయం చేసారు. ఇంట్రడక్షన్ సీన్లో హీరోలను కొట్టే సీన్ ప్రతీ సినిమాలో ఉన్నట్టే ఉంది. పంచె కట్టుకుని హీరో చేసే యాక్షన్ ఫైట్స్ బాగుంటాయి. మెగా ఫ్యాన్స్ మాత్రం విజిల్స్ తో షేక్ చేసారు. సినిమాను మాత్రం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు. పాటలు కూడా చాలా నీట్ గా కక్కుర్తి లేకుండా షూట్ చేసారు. అవినీతిని అడ్డుకునే సీన్ లు కాస్త క్లాస్ మాస్ కు నచ్చుతాయి. ఎలివేషన్ సీన్లు కూడా బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సూపర్, ఫెయిల్ లవ్ ట్రాక్: శంకర్ సినిమాల్లో లవ్ ట్రాక్ ఎప్పుడూ బోరింగ్ గానే ఉంటుంది. అప్పుడప్పుడు మినహా లవ్ సీన్స్ కి పెద్దగా వెయిట్ ఇవ్వడు. ఈ సినిమాలో కూడా అలాగే ఉంది. లవ్ ట్రాక్ ను ఇంట్రస్టింగ్ గా చూపించలేదు అనే ఒపినియన్ వచ్చింది. హీరో, హీరోయిన్ మధ్యన సీన్స్ బోరింగ్ గా ఉంటాయి. కాలేజి ఎపిసోడ్ మోస్ట్ బోరింగ్ సీన్. కోపాన్ని కంట్రోల్ చేసుకునే సీన్స్ కూడా అంతగా బాగాలేదు అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉంటుంది. రామ్ చరణ్ అసలు ఐఏఎస్ అవ్వాలని ఎందుకు అనుకున్నాడు అనేది కన్విన్సింగ్ గా చెప్పలేకపోయారు. సునీల్ కామెడి కూడా బోరింగ్ గా ఉంది. బ్రహ్మానందం ను ఒక సీన్ లో చూపించారు. కలెక్టర్ రామ్, మంత్రి మోపిదేవి మధ్య ఉండే సీన్లు సినిమా హైప్ పెంచేస్తాయి. ఇంటర్వెల్ ముందు పావు గంట మాస్ ఆడియన్స్ కు పిచ్చి ఎక్కిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాను బ్రతికిస్తుంది. సెకండ్ హాఫ్ ను బ్రతికించింది ఆ పావు గంటనే. అప్పన్న రోల్ లో రామ్ చరణ్ బాగా నటించాడు. ఇంటర్వెల్ తర్వాత కనపడే అప్పన్న రోల్ ను చాలా నీట్ గా డిజైన్ చేసాడు శంకర్. ఆ రోల్ ను ఎమోషనల్ గా ఆడియన్స్ కు కనెక్ట్ చేసాడు. రంగస్థలం రేంజ్ లో రామ్ చరణ్ యాక్టింగ్ ఉంటుంది. అప్పన్న రోల్ ఎక్కువ టైం లేకపోయినా... ఇంపాక్ట్ చూపించింది. పార్వతీ పాత్ర కూడా చాలా బాగుంటుంది. అప్పన్నను మోసం చేసే సీన్ ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. రాజకీయ పార్టీలలో డబ్బు ప్రాధాన్యత ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ఫ్లాష్ బ్యాక్ మాత్రం పవర్ ఫుల్ గా చూపించారు. గెస్ చేసేయొచ్చు తర్వాత ఏం జరుగుతుందో క్లియర్ గా అర్ధమవుతూ ఉంటుంది. అదే సినిమాకు మైనస్ అయింది. రామ్, మోపిదేవి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ బాగుంది. అక్కడి నుంచి సీన్లు అన్నీ గెస్ చేయొచ్చు. క్లైమాక్స్ కంటే ప్రీ క్లైమాక్స్ బాగుంది అనే చెప్పాలి. రాజకీయ నాయకులకు మెసేజ్ ఇచ్చేలా సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తాడు రామ్ చరణ్. ఎలక్షన్ కమీషన్ పవర్ ఎలక్షన్ కమీషన్ పవర్ ఏ రేంజ్ లో ఉంటుందో ఈ సినిమాలో చూపించాడు రామ్ చరణ్. పొలిటికల్ లీడర్లను ఐఏఎస్ ఆఫీసర్ ఎలా కంట్రోల్ చేయగలడో చూపించాడు. సెకండాఫ్ లో ఈ సీన్లు చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. ఎలక్షన్ కమీషన్ కు, రాజకీయ పార్టీలకు, ప్రజలకు కూడా మంచి మెసేజ్ ఉంటుంది. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లో ఈ సీన్లు బాగున్నాయి. సాంగ్స్ వెరీ గ్రాండ్ గేమ్ ఛేంజర్ సినిమాలో పాటలు చాలా బాగా షూట్ చేసారు. శంకర్ సినిమాల్లో ఉండే గ్రాండ్ ఈ సాంగ్స్ లో కనపడింది. రా మచ్చా మచ్చా పాటను చాలా బాగా ప్లాన్ చేసారు. జరగండి పాట సెట్ బాగుంటుంది. డాన్స్ లో రామ్ చరణ్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అరుగు మీద అనే పాట సినిమాకు హైలెట్ గా నిలిచింది. మంచి ఎమోషన్ పండించారు. లిరిక్స్ కూడా బాగుంటుంది. ఓకే శంకర్ ఓకే డైరెక్టర్ శంకర్ అనగానే అంచనాలు వేరే లెవెల్ లో ఉంటాయి. కాని వాటిని రీచ్ అవ్వలేదు అనే చెప్పాలి. శంకర్ మార్క్ సీన్స్ చాలా తక్కువ కనిపించాయి. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. సెకండాఫ్ లో పవర్ఫుల్ సీన్స్ ప్లాన్ చేసాడు. తాను చెప్పాలనుకున్నది డైరెక్ట్ గా, పవర్ ఫుల్ గా చెప్పే శంకర్ లో ఆ మార్క్ కనపడలేదు. మెసేజ్ బాగుంది గాని జనాలకు కనెక్ట్ అయ్యేలా చూపించలేదు అనే చెప్ప్పాలి. శంకర్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారని చెప్పడం కష్టమే. మాస్ ఆడియన్స్ కు మాత్రం సినిమా నచ్చుతుంది. సినిమాను మాత్రం చాలా రిచ్ గా ప్లాన్ చేసారు. యాక్టింగ్ గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్. రామ్నం్దన్, అప్పన్న రెండు పాత్రల్లోనూ రామ్ చరణ్ తన రేంజ్ యాక్టింగ్ చూపిస్తాడు. అప్పన్న పాత్రలో చాలా బాగా ఆకట్టుకున్నాడు. కాలేజ్ లుక్ స్పెషల్ అట్రాక్షన్ గా ప్లాన్ చేసాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా రామ్ చరణ్ చాలా బాగా నటించాడు. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. డాన్స్ లో తండ్రికి తగ్గ తనయుడు అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఎస్జే సూర్య గురించి స్పెషల్ గా చెప్పేది ఏముంది. నటన కోసం ప్రాణం పెట్టాడు. ఎమోషనల్ సీన్స్ సినిమాకు హైలెట్ అయ్యాయి. ఈ సినిమాలో అంజలీ మాత్రం ప్రాణం పెట్టి యాక్ట్ చేసింది. హీరోయిన్ చూడటానికి మాత్రం చాలా బాగుంది. ఇక సీనియర్ యాక్టర్స్ శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, సునీల్ తమ పరిధిలో బాగానే నటించారు. ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే అబోవ్ యావరేజ్ సినిమా. ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ బాగున్నాయి. సెకండాఫ్ వేరే లెవెల్ లో ఉంటుంది. పొలిటికల్ డ్రామాను చాలా బాగా చూపించారు. రామ్ చరణ్ ఈ సినిమాకు ప్లస్. డైరెక్టర్ శంకర్ మాత్రం డిసప్పాయింట్ మాత్రం చేయలేదు. ఈ సంక్రాంతికి మంచి మాస్ మూవీ. అంచనాలు లేకుండా వెళ్తే బాగుంటుంది. చూడాల్సిన సినిమా... ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేయొచ్చు.[embed]https://www.youtube.com/watch?v=3SBg2BUS7NQ[/embed]