గేమ్ చేంజర్ ట్రైలర్ రివ్యూ.. అన్ ప్రెడిక్టబుల్
మెగా ఫాన్స్ కు పండగ స్టార్ట్ అయింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.
మెగా ఫాన్స్ కు పండగ స్టార్ట్ అయింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. దాదాపు మూడు ఏళ్ల నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న మెగా ఫాన్స్ కు ఈ ట్రైలర్ సంక్రాంతిని ముందే తీసుకొచ్చింది. దాదాపు 7 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ హీరోగా సోలో సినిమా రానుంది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అంటూ అందరూ ఎదురుచూస్తున్నారు. సినిమా కథ ఎలా ఉండబోతుంది… శంకర్.. రామ్ చరణ్ ను ఏ రేంజ్ లో చూపించబోతున్నాడు.. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా ఏ రికార్డులు బద్దలు కొట్టబోతుంది అంటూ మెగా అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఎదురు చూస్తున్నారు.
సినిమా షూటింగ్ ఆలస్యమైనా సరే కచ్చితంగా హిట్ కొడతామనే ధీమాలో కూడా మేకర్స్ ఉన్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఇక ప్రమోషన్ ఈవెంట్స్ కూడా ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. ఇక తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.
ఒక్కసారి ట్రైలర్ చూస్తే.. ముందు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. పక్కా కమర్షియల్ బొమ్మ అనేది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే క్లారిటీ ఇచ్చాడు తమన్. అలాగే రామ్ చరణ్ లుక్ కూడా ఫ్యాన్స్ కు మంచి ఫిస్ట్ ఇచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ గా నటిస్తున్నాడు. ఒక ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారి ఏ రేంజ్ లో పవర్ఫుల్ అనేది ఈ సినిమాలో రామ్ చరణ్ చూపించబోతున్నాడు. ఇక సినిమాటోగ్రఫీ కూడా ఒక వేరే లెవెల్ లో ఉంది. కమర్షియల్ సినిమా అంటే ఇలా ఉండాలి అన్నట్టు ట్రైలర్ ను కట్ చేశారు మేకర్స్.
శంకర్ డైరెక్షన్ పై ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు ఒక నమ్మకం ఉంది. కచ్చితంగా సినిమాలో ఏదో ఒక సోషల్ ఎలిమెంట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు. అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సినిమాలో అవినీతి మీద అలాగే బ్లాక్ మనీ మీద ఒక ఐఏఎస్ చేసే పోరాటాన్ని చూపిస్తున్నట్టు క్లియర్ గా అర్థమైంది. ట్రైలర్ చూస్తే కామెడీ కూడా ఓ రేంజ్ లోనే ప్లాన్ చేసినట్టు అర్థం అవుతుంది. సునీల్ కామెడీ గురించి జస్ట్ ఇంట్రో మాత్రమే ఇచ్చారు. ఇక ఎస్ జె సూర్య విలనిజం కూడా సినిమాకు హైలైట్ అవ్వబోతుంది అనేది ట్రైలర్ తో క్లారిటీ వచ్చింది.
ఒక ఐఏఎస్ ముఖ్యమంత్రితో పోరాటం చేయబోతున్నట్టు… ఈ ట్రైలర్ లో చూపించారు. నువ్వు ఐదేళ్లు మాత్రమే మంత్రివి నేను చచ్చిపోయే వరకు ఐఏఎస్ అంటూ రాంచరణ్ నోటు నుంచి వచ్చిన డైలాగ్ పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేయడం ఖాయం. అలాగే ట్రైలర్ స్టార్టింగ్ లో ఉన్న ఒక డైలాగ్ కూడా ఇప్పుడు ఫ్యాన్స్ కు పిచ్చపిచ్చగా నచ్చేసింది. 100 ముద్దలు తిన్న ఏనుగు ఒక ముద్ద తినకపోతే వచ్చే నష్టమేమీ లేదని ఆ ఒక్క ముద్దతో ఎన్నో ప్రాణులు బతుకుతాయి అంటూ అవినీతి సొమ్ము గురించి క్లారిటీ ఇచ్చాడు. సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఆ లుక్కులో కూడా ఈ మెగా హీరో పక్కాగా ఒదిగిపోయాడు. దీనితో జనవరి 10 కోసం వెయిటింగ్ భీభత్సంగా స్టార్ట్ అయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్ లొకేషన్స్ అన్నీ కూడా మాస్ ఆడియన్స్ కు పక్కాగా నచ్చుతాయి.