చిరంజీవిపై గీతా ఆర్ట్స్ ట్వీట్.. మెగా హీరోలను అల్లు అరవింద్ బుట్టలో వేసుకుంటున్నాడా..?

ఎవరు అవునన్నా కాదన్నా.. గత కొన్నేళ్లుగా మెగా కుటుంబంలో ఒక తెలియని గ్యాప్ అయితే ఉంది అనేది కాదనలేని వాస్తవం. ఒకప్పటిలా చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య ఇప్పుడు రిలేషన్ కనిపించట్లేదు అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 17, 2025 | 01:20 PMLast Updated on: Mar 17, 2025 | 1:20 PM

Geetha Arts Tweet On Chiranjeevi Is Allu Aravind Putting Mega Heroes In The Basket

ఎవరు అవునన్నా కాదన్నా.. గత కొన్నేళ్లుగా మెగా కుటుంబంలో ఒక తెలియని గ్యాప్ అయితే ఉంది అనేది కాదనలేని వాస్తవం. ఒకప్పటిలా చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య ఇప్పుడు రిలేషన్ కనిపించట్లేదు అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది. మా మధ్య ఏమి లేదు మేమంతా కలిసి ఉన్నామని వాళ్లు ఎంత చెప్పుకున్నా కూడా అల్లు, మెగా కుటుంబాల మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ రేంజ్ పెరిగిన తర్వాత మెగా కుటుంబంతో అల్లు అరవింద్ కావాలని ఒక గ్యాప్ మైంటైన్ చేస్తున్నారు అనే గాసిప్ కూడా ఇండస్ట్రీలో బాగానే వినిపిస్తుంది. అల వైకుంఠపురంలో ముందు వరకు మా మెగా ఫ్యాన్స్ అని చెప్పిన అల్లు అర్జున్.. ఆ తర్వాత నా ఆర్మీ అంటున్నాడు. పుష్ప వచ్చిన తర్వాత నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు మీరు తప్ప అన్నాడు. ఇన్ని జరుగుతున్నా కూడా అల్లు అరవింద్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజానికి అల్లు అరవింద్, చిరంజీవి మధ్య ఎప్పుడూ దూరం రాదు. ఎందుకంటే బావ బామ్మర్దుల కంటే కూడా స్నేహితులుగానే ఉంటారు ఈ ఇద్దరూ. తాజాగా చిరంజీవికి లండన్ పార్లమెంట్ సభ్యులు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతున్నారు. మార్చి 19న జరగబోయే ఈ ప్రధానోత్సవానికి చిరంజీవి వెళుతున్నాడు.

చిరంజీవికి దక్కిన ఈ అరుదైన ఘనతపై ఇప్పటి వరకు చాలామంది కంగ్రాట్స్ చెప్పారు. తాజాగా గీతా ఆర్ట్స్ కూడా దీనిమీద ఒక ట్వీట్ వేసింది. ఇది చూశాక మళ్ళీ మెగా హీరోలను బుట్టలో వేసుకోవడానికి అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నాడు అంటున్నారు ఫాన్స్. నిజానికి సినిమాల పరంగా గీత ఆర్ట్స్ తో చిరంజీవికి బాగా గ్యాప్ వచ్చింది. ఒకప్పుడు గీతా ఆర్ట్స్ ను తన సొంత బ్యానర్ అనేవాడు చిరంజీవి. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. తనకంటూ సొంత బ్యానర్ పెట్టుకుని అందులో వరస సినిమాలు చేస్తున్నాడు ఈయన. సాధారణంగా తన సినిమాలకు మాత్రమే పార్టీ ఇచ్చే అల్లు అరవింద్.. అప్పట్లో సైరా సినిమాకు అందర్నీ పిలిచి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. అయితే ఉన్నట్టుండి చిరంజీవి సినిమా కోసం పార్టీ ఇవ్వడాన్ని అప్పట్లో అంతా ఆసక్తికరంగా చూసారు కూడా. అల్లు అరవింద్ ఎందుకు ఈ పార్టీ ఇచ్చినట్టు అంటూ ఆరా తీసారు. దీని వెనుక కూడా ఒక కారణం లేకపోలేదు.

ఒకప్పుడు చిరంజీవి గీతా ఆర్ట్స్ లో వరుస సినిమాలు చేశాడు. అల్లు అరవింద్ నిర్మించిన సినిమాల్లో సగానికి పైగా చిరంజీవి హీరోగా నటించినవే. అప్పట్లో సొంత నిర్మాణ సంస్థలా గీతా ఆర్ట్స్ లో సినిమాలు చేసేవాడు మెగాస్టార్. కానీ ఇప్పుడు ఆయన సొంతంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పెట్టుకున్నాడు. రామ్ చరణ్ నిర్మాతగా అందులోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు చిరంజీవి. దాంతో చిరంజీవిని ప్రసన్నం చేసుకోవడానికి.. తమ మధ్య ఉన్న గ్యాప్ తగ్గించడానికి చిరంజీవి మీద గీతా ఆర్ట్స్ ట్వీట్ వేసింది అనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్త. మెగా హీరోలు ఇప్పుడు ఫ్లాప్స్ లో ఉండొచ్చు.. అల్లు అర్జున్ హైలో ఉండొచ్చు.. అంత మాత్రానికి మెగా ఫ్యామిలీని తక్కువగా వేయడానికి లేదు. ఈ విషయం అల్లు అరవింద్ కు బాగా తెలుసు. అందుకే తనకు ఛాన్స్ దొరికిన ప్రతిసారి చిరంజీవి గురించి గొప్పగా చెప్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా అవకాశం దొరికింది కాబట్టి వెంటనే ట్వీట్ చేసింది గీతా ఆర్ట్స్. ఎంత చేసినా ఇప్పటికి చిరంజీవితో కాస్త గ్యాప్ అయితే వాళ్లకు కనిపిస్తుంది. అందుకే ఎన్నో టాక్ షోలకు వెళ్లిన చిరంజీవి.. అల్లు అరవింద్ ఆహాలో బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోకు ఆహ్వానం అందిన కూడా వెళ్లలేదు. మరి ఈ గ్యాప్ ఇలాగే కంటిన్యూ అవుతుందా లేదా అంటే ఫ్యూచర్లో కనిపించకుండా పోతుందా అనేది చూడండి.