Game Changer : గెట్ రెడీ ఫ్యాన్స్ ’గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ ఇదే..

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో దిల్‌రాజు నిర్మిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా రిలీజ్‌పై కొన్నిరోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్ ఆగిపోయిందని.. వచ్చే ఏడాది కూడా రిలీజ్ కష్టమని.. శంకర్ ఇండియన్ 3 పై ఫోకస్ పెట్టనున్నట్లు సోషల్ మీడియా వేదికగా న్యూస్ తెగ చక్కర్లు కొడుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 25, 2023 | 01:55 PMLast Updated on: Dec 25, 2023 | 1:55 PM

Get Ready Fans Game Changer Release Date Is This

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో దిల్‌రాజు నిర్మిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా రిలీజ్‌పై కొన్నిరోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్ ఆగిపోయిందని.. వచ్చే ఏడాది కూడా రిలీజ్ కష్టమని.. శంకర్ ఇండియన్ 3 పై ఫోకస్ పెట్టనున్నట్లు సోషల్ మీడియా వేదికగా న్యూస్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. ఇప్పట్లో థియేటర్లోకి రావడం కష్టమే అంటున్నారు. కానీ తాజాగా నిర్మాత దిల్ రాజు దీనిపై క్లారిటీ ఇచ్చినట్టుగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

దీపావళికి లీక్ అయిన జరగండి సాంగ్‌ను రిలీజ్ చేస్తామని చెప్పి.. పోస్ట్ పోన్ చేసి మెగా ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేశారు. అప్పటి నుంచి గేమ్ చేంజర్ గురించి మరో గుడ్ న్యూస్ బయటికి రాలేదు. అలాగే రిలీజ్ డేట్ విషయంలోను మెగాఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. త్వరలోనే గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ అవుతుందని చెబుతున్నప్పటికీ.. రిలీజ్‌కు మాత్రం చాలా రోజులు వెయిట్ చేయాల్సిందేనని వార్తలు వస్తునే ఉన్నాయి. వచ్చే సమ్మర్‌లోనైనా గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుందనే ఆశలో ఉన్నారు చరణ్ ఫ్యాన్స్. కానీ సమ్మర్ కాకుండా.. నెక్స్ట్ ఇయర్ దసరాకే గేమ్ చేంజర్ వచ్చే ఛాన్స్ ఉందనే న్యూస్.. ఆ మధ్య వైరల్‌గా మారింది.

కానీ కాస్త ముందుకు వచ్చినట్టుగా లేటెస్ట్ అప్డేట్ చెబుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై నిర్మాత దిల్ రాజు ఒక క్లారిటీ ఇచ్చాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సలార్ సినిమా చూడటానికి వెళ్లిన దిల్ రాజు.. గేమ్ ఛేంజర్ అప్డేట్ అడిగారట అభిమానులు. దీంతో.. గేమ్ చేంజర్ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో రిలీజ్ కానుందని చెప్పుకొచ్చాడట. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కానీ ఇదే విషయాన్ని అఫీషియల్‌గా ఎందుకు అనౌన్స్ చేయడం లేదనేదే.. అర్థం కాకుండా పోయింది. ఒకవేళ గేమ్ చేంజర్ 2024 సెప్టెంబర్‌లో వస్తే.. మరో పది నెలలు మెగా ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే.