Gfx 300 కోట్లు.. మేకింగ్ కి 350కోట్లు.. హర్రర్ లో టెర్రర్..
ఇండియన్ సినిమాకే 2000 కోట్లు హయ్యెస్ట్ వసూళ్ల రికార్డు.. అది హిందీ మూవీ దంగల్ కే దక్కింది. తర్వాత బాహుబలి 2, పుష్ప2 మూవీలు 1850 కోట్లు వసూళ్లని రీచ్ అయ్యాయి.

ఇండియన్ సినిమాకే 2000 కోట్లు హయ్యెస్ట్ వసూళ్ల రికార్డు.. అది హిందీ మూవీ దంగల్ కే దక్కింది. తర్వాత బాహుబలి 2, పుష్ప2 మూవీలు 1850 కోట్లు వసూళ్లని రీచ్ అయ్యాయి. కట్చేస్తే ఆతర్వాత రికార్డంటే త్రిబుల్ ఆర్ దే… ఎలాచూసినా ఇండియా టాప్ 5 మూవీస్ కూడా ఇంతవరకు 2 వేల కోట్ల రికార్డుని దాటలేదు. కాని అదే ఇప్పుడు జరిగేలా ఉంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీ రిలీజ్ కి ముందే 5 వేల కోట్ల లెక్కల్ని కన్ఫామ్ చేస్తోంది. కాని అది రావటానికి ఇంకా రెండేళ్లు టైంపడుతుంది. కానీ ఈలోపు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ కో 12000 కోట్ల సునామీకి సిద్దమయ్యారు. ఒకటి కాదు రెండు కాదు, అరడజన్ షాకులకు సిద్దమయ్యారు. ఆల్రెడీ బడ్జెట్ పరంగా చూస్తేనే 5000 కోట్ల లెక్కలు తేలుతున్నాయి. అవి వర్కవుట్ అయితే 12000 కోట్లు రావటం అనేది మినిమమ్ గ్యారెంటీ.. అదే అన్నీ బ్లాక్ బస్టర్లే అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఎన్నడూ చూడని నెంబర్స్ చూస్తామా..? హావేలుక్
ది రాజా సాబ్ ఎప్పుడో మొదలైంది. ఇప్పుడు ట్రబుల్ లో ఉందనే కామెంట్స్ ఫేస్ చేస్తోంది. దీనికి తోడు ప్రభాస్ మోకాలి నొప్పి వల్ల మిగిలిన పాటల షూటింగ్ ఆగింది. ఇదే విషయంలో చాలా రూమర్లొచ్చాయి. యాంటి ఫ్యాన్స్ నోటికి పని చెప్పే పరిస్థితొచ్చింది. ఇలాంటి టైంలో రూమర్లకు బ్రేక్ వేయటమే కాదు, కిక్ ఇచ్చే న్యూస్ ఇచ్చాడు డైరెక్టర్ మారుతి.90 శాతం ది రాజా సాబ్ గ్రాఫిక్స్ వర్క్ పూర్తైందట. 300 కోట్ల భారీ ఖర్చు పూర్తిగా గ్రాఫిక్స్ కే కేటాయించారని తెలుస్తోంది. ఫైనల్ ఔట్ పుట్ బాగుందని, ఐతే క్లైమాక్స్ తాలూకు గ్రాఫిక్స్ వర్క్ క్లియార్ కాలేదనే తేల్చాడు. ఆ ఔట్ పుట్ వచ్చాక, అప్పుడు పాటల షూటింగ్ ని ఆ ఔట్ పుట్ కి తగ్గట్టు ప్లాన్ చేస్తారట.
అంటే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ గ్రాఫిక్స్ వర్క్ ఔట్ పుట్ వస్తే కాని, పాటల షూటింగ్ మొదలు పెట్టొద్దనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు ప్రభాస్ ఈ మూవీకి బ్రేకులేస్తున్నాడనే వార్తల్లో నిజం లేదని తేలింది. ఫౌజీ షూటింగ్ కూడా ది రాజా సాబ్ షూటింగ్ కి అడ్డు పడలేదని కన్ఫామ్ అయ్యింది.ఇక ది రాజా సాబ్ మొత్తం బడ్జటె్ 650 కోట్లని తెలుస్తోంది. అందులో 300 కోట్ల వరకు గ్రాఫిక్స్ కే ఖర్చైందట. రెబల్ స్టార్ కూడా ఫస్ట్ టైం హర్రర్ కామెడీ మూవీతో ఎటాక్ చేస్తున్నాడు. కెరీర్ లో ఫస్ట్ టైం ఈ జోనర్ ని టచ్ చేశాడు. ఇక ఫౌజీని పూర్తి చేశాకే స్పిరిట్ మూవీతో బిజీ కాబోతున్నాడు.
సలార్ తో 800 కోట్లు, కల్కీ తో 1200 కోట్లు రాబట్టిన రెబల్ స్టార్, ది రాజా సాబ్ తో హ్యాట్రిక్ కిక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈనెల 10కి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా, గ్రాఫిక్స్ వర్క్ వల్లే డిలే అవుతోంది. ఆగస్ట్ 14 కి రిలీజ్ చేస్తారనే టాక్ నడిచినా, దసరాకే ది రాజా సాబ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. జూన్ నెలలో మాత్రం రాజా సాబ్ కొత్త రిలీజ్ డేట్ ని చిన్న వీడియో ప్రోమోతో రిలీజ్ చేయాలని ఇనీషియాల్ గా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.