Mahesh babu : ఘట్టమనేని గ్రాడ్యుయేషన్ డే… మహేశ్ లుక్‍కు ఫ్యాన్ ఫిదా…
కొడుకు పుట్టినప్పుడు కాదు అతడు ఏదైనా సాధించినప్పుడే తండ్రికి అసలైన పుత్రోత్సాహం అని అంటారు.. ఇక.. ఎంతటి సూపర్ స్టార్ అయినా అనుభూతులకు అతీతుడు ఏమీ కాడు కదా.. అందుకే.. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇప్పుడు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నాడు.
కొడుకు పుట్టినప్పుడు కాదు అతడు ఏదైనా సాధించినప్పుడే తండ్రికి అసలైన పుత్రోత్సాహం అని అంటారు.. ఇక.. ఎంతటి సూపర్ స్టార్ అయినా అనుభూతులకు అతీతుడు ఏమీ కాడు కదా.. అందుకే.. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇప్పుడు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నాడు.. పుట్టడమే గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఘట్టమనేని.. తండ్రితో ‘1 నేనొక్కడినే’ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసిన గౌతమ్ ఇప్పుడు విద్యార్థిగా తన కెరీర్‌లో మరో మెట్టు ఎక్కి తన తండ్రి గర్వించేలా చేశాడు.. తన కుమారుడు గౌతమ్ ఘట్టమనేని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సందర్భంగా ఎమోషనల్ అయ్యాడు మహేశ్.. సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.. లైఫ్‌లో నెక్స్ట్ ఛాప్టర్ను నీవే రాసుకోవాలి గౌతమ్అంటూ ట్వీట్ చేశాడు..
గౌతమ్ అమెరికన్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందాడు.. తన గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా మహేష్ బాబు, నమ్రత, సితార కాన్వకేషన్ డే సందర్భంగా అక్కడకు వెళ్లారు.. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు మహేశ్.. తన హృదయం గర్వంతో పొంగిపోయిందని అన్నాడు..
గ్రాడ్యుయేషన్ పూర్తి అయినందుకు అభినందనలు.. నీ జీవితంలో తదుపరి అధ్యాయాన్ని నువ్వే రాసుకోవాలి. నువ్వు గొప్ప స్థాయికి ఎదుగుతావని నాకు తెలుసు. కలల్ని అందుకునేందుకు పరుగెత్తాలి. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా.. ఈరోజు నేను గర్వించదగ్గ ఘట్టమనేని గౌతమ్ తండ్రిని అంటూ ట్వీట్ చేశారు మహేశ్.. అంతేకాదు, గౌతమ్ కాన్వొకేషన్ కార్యక్రమానికి హాజరైనప్పటి ఫొటోలు కూడా పంచుకున్నాడు మహేశ్..
అటు.. నమత్ర కూడా గౌతమ్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో పలు చిత్రాలను పోస్ట్ చేశారు.. తాను చాలా గర్విస్తున్నట్లు కామెంట్ చేశారు.. నీకు నా ప్రేమ, సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది అంటూ పుత్రోత్సాహంతో పొంగిపోయారు.. మహేశ్, నమ్రత చేసిన ఈ పోస్ట్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. మహేశ్, నమ్రతలకు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.. గౌతమ్ ఘట్టమనేని వారసుడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు తెచ్చుకుంటాడంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు..