Pankaj Udhas: ప్రముఖ గాయకుడు పంకజ్ ఉదాస్ కన్నుమూత..
సోమవారం ఉదయం పంకజ్ ఉదాస్ మరణించినట్లు ఆయన కుమార్తె నయాబ్ ఉదాస్ తెలిపారు. పంకజ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, ముంబై పట్టణంలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మరణించారని నయాబ్ ఉదాస్ వెల్లడించారు.
Pankaj Udhas: ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ (72) అనారోగ్యంతో కన్నుమూశారు. సోమవారం ఉదయం పంకజ్ ఉదాస్ మరణించినట్లు ఆయన కుమార్తె నయాబ్ ఉదాస్ తెలిపారు. పంకజ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, ముంబై పట్టణంలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మరణించారని నయాబ్ ఉదాస్ వెల్లడించారు. పంకజ్ ఉదాస్ మరణవార్తను చాలా బరువెక్కిన హృదయంతో మీకు తెలియజేసేందుకు చింతిస్తున్నామని నయాబ్ ఉదాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Nayanthara: వంద కోట్లు ఇస్తా వస్తావా.. దొబ్బేయ్ రా.. నయన డోంట్ కేర్ ఆన్సర్
పంకజ్ మృతితో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. పంకజ్ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ ప్రాంతం, చర్ఖాడి-జైత్‌పూర్ గ్రామంలో 1951 మే 17న పంకజ్ జన్మించారు. గజల్ గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. 1980, 90 దశకాల్లో ఆయన పాటలు నాటి శ్రోతల్ని ఉర్రూతలూగించాయి. మన దేశంలో గజల్ సంగీతానికి పేరు తెచ్చిన వారిలో పంకజ్ ఒకరిగా నిలిచారు. ఆయన గాత్రానికి మన దేశంలోనే కాక విదేశాలలోనూ భారీగా అభిమానులున్నారు. పలు భాషల్లో అనేక సినిమా గీతాలు కూడా ఆయన ఆలపించారు. తెలుగులోనూ స్పర్శ సహా పలు సినిమాల్లో పాటలు పాడారు. ఇక్కడా ఆయన పాటలకు మంచి ఆదరణ లభించింది. పలు ప్రైవేటు ఆల్బమ్స్ రిలీజ్ చేసి సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు. పంకజ్ చేసిన సేవలకుగాను ఆయనను 2006లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
చాంది జైసా రంగ్ హై తేరా, ఔర్ అహిస్తా కీజియే బాతే, న కజ్రే కి దార్, చిట్టి ఆయిహై వంటి గజల్స్ పంకజ్ ఉదాస్‌కు పేరు తెచ్చాయి. పంకజ్ ఉదాస్ మృతిపై గాయకుడు సోనూ నిగమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించాడు. “నా బాల్యంలో చాలా ముఖ్యమైన భాగం ఈ రోజు కోల్పోయింది. శ్రీ పంకజ్ ఉదాస్ జీ నువ్వు ఇక లేవని తెలిసి నా గుండె రోదిస్తుంది. ఓం శాంతి” అంటూ పోస్ట్ చేశారు. పంకజ్‌కు భార్య ఫరీదా ఉదాస్, కుమార్తెలు నయాబ్, రీవా ఉదాస్ లు ఉన్నారు.