Game Changer : వైజాగ్ కి షిప్టైన ‘గేమ్ ఛేంజర్’
గ్లోబల్ స్టార్ (Global Star) రామ్‌చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) వైజాగ్ కి షిప్టైంది. ‘గేమ్ ఛేంజర్’ షూట్ కోసం చరణ్ వైజాగ్ ఎయిర్‌పోర్టులో ల్యాండైన విజువల్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

Global Star Ram Charan 'Game Changer' has been shipped to Vizag.
గ్లోబల్ స్టార్ (Global Star) రామ్‌చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) వైజాగ్ కి షిప్టైంది. ‘గేమ్ ఛేంజర్’ షూట్ కోసం చరణ్ వైజాగ్ ఎయిర్‌పోర్టులో ల్యాండైన విజువల్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక.. నిన్నటివరకూ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాలోని కొన్ని ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించాడు డైరెక్టర్ శంకర్. ఇక.. లేటెస్ట్ గా వైజాగ్ (Vizag) లోనూ కొన్ని రోజుల పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందట.
ఈ కొత్త షెడ్యూల్ లో చరణ్ తో పాటు ఎస్.జె.సూర్య, సునీల్ వంటి వారు పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో 50వ చిత్రంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ‘గేమ్ ఛేంజర్’ను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే ‘జరగండి జరగండి’ అనే పాట వచ్చింది.
ఆద్యంతం శంకర్ స్టైల్ లో ఎంతో భారీగా తెరకెక్కిన ఈ లిరికల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈమూవీలో రామ్ చరణ్ డబుల్ రోల్ లో కనిపించనున్నాడు. రాజకీయ నాయకుడిగా ప్రభుత్వాధికారిగా కనిపించనున్నాడు. ఇప్పటికే బయటకు వచ్చిన కొన్ని లీక్ వీడియోలు సినిమాపై అంచనాలు పెంచాయి. వైజాగ్ షెడ్యూల్ తోనే సినిమా చివరి దశకు చేరిందని టాక్ నడుస్తోంది. మొత్తంమీద.. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ లో ‘గేమ్ ఛేంజర్’ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు డైరెక్టర్ శంకర్.