మెగాస్టార్ తో గ్లోబల్ స్టార్… కొడుకు ప్రొడక్షన్ లో చిరూ

ఏడు పదుల వయసు దగ్గర పడుతున్న సరే మెగాస్టార్ చిరంజీవి మాత్రం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. యువ హీరోలతో సమానంగా చిరంజీవి సినిమాలు చేయడం చూసి ఇతర భాషల్లో స్టార్ సీనియర్ హీరోలు కూడా చిరంజీవి స్పీడ్ రీచ్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 17, 2024 | 06:40 PMLast Updated on: Dec 17, 2024 | 6:40 PM

Global Star With Megastar Chiru In Sons Production

ఏడు పదుల వయసు దగ్గర పడుతున్న సరే మెగాస్టార్ చిరంజీవి మాత్రం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. యువ హీరోలతో సమానంగా చిరంజీవి సినిమాలు చేయడం చూసి ఇతర భాషల్లో స్టార్ సీనియర్ హీరోలు కూడా చిరంజీవి స్పీడ్ రీచ్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వయసులో కూడా పాన్ ఇండియా సినిమాలతో చిరంజీవి స్పీడు చూస్తుంటే వింటేజ్ మెగాస్టార్ ఇస్ బ్యాక్ అనే సంకేతాలు వస్తున్నాయి. రామ్ చరణ్ కోసం విశ్వంబర సినిమాను వాయిదా వేసుకున్న చిరంజీవి ఈ సినిమాను వచ్చేయడాది రిలీజ్ చేయనున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ స్టేజ్ లో ఉంది. మరో 20 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసి సంక్రాంతి టైం కి ట్రైలర్ రిలీజ్ చేయాలని చిరంజీవి ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల ఒక సినిమా రెడీ కానుంది. ఈ సినిమాను రీసెంట్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. నాని నిర్మాతగా రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దసరా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల… మెగాస్టార్ తో ఏ రేంజ్ లో సినిమా చేస్తాడు అంటూ మెగా ఫ్యాన్స్ పిచ్చిపిచ్చిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత మరో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కూడా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు మెగాస్టార్. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు కంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రానుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా కోసం చిరంజీవి కాస్త బరువు కూడా తగ్గనున్నారట. వచ్చేయడాది ఏప్రిల్ నుంచి ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ముందు శ్రీకాంత్ సినిమా కంటే అనిల్ రావిపూడి సినిమానే ఉండనున్నట్లు టాక్. విశ్వంబరా సినిమా రిలీజ్ తర్వాత చిరంజీవి కాస్త ఫ్రీ అవుతారు.

ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి మళ్లీ మొదలుపెట్టే ప్లాన్ లో ఉన్నారు మెగాస్టార్. త్వరలోనే విశ్వంభరా సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ కూడా రానుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఈవెంట్ను ముంబైలో కూడా ప్లాన్ చేశారు మేకర్స్. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మూడు చోట్ల నిర్వహించే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో కూడా చిరంజీవికి క్రేజ్ ఉంది. దీనితో కర్ణాటక ముంబై హైదరాబాదులో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. అయితే అనిల్ రావిపూడి సినిమాను ఎవరు నిర్మిస్తారు ఏంటి అనేదానిపై మాత్రం స్పష్టత లేదు. కానీ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు రాంచరణ్ కూడా పెట్టుబడి పెట్టమన్నాడు.