దేవరని డాలర్లలో మించలేరు… కనీసం టచ్ కూడా చేయట్లేదు.

పుష్ప 2 రిలీజ్ కి ముందే 1000 కోట్ల బిజీనెస్ చేసిందంటున్నారు. కాని యూఎస్ లో మాత్రం ఎందుకో పుష్పరాజ్ కి ఫైర్ తగ్గిందనే కామెంట్లు పెరిగాయి. ఇంకా రిలీజ్ కాని మూవీ ఫైరా ఫ్లవరా అప్పుడే తేల్చటం కష్టం. కాని ఎందుకో దేవర తాలూకు ప్రివ్యూ రికార్డుల్ని పుష్ప 2 ఈజీగా చెరిపేస్తుందన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 4, 2024 | 04:25 PMLast Updated on: Dec 04, 2024 | 4:25 PM

God Cant Be Surpassed In Dollars At Least Not Even Touched

పుష్ప 2 రిలీజ్ కి ముందే 1000 కోట్ల బిజీనెస్ చేసిందంటున్నారు. కాని యూఎస్ లో మాత్రం ఎందుకో పుష్పరాజ్ కి ఫైర్ తగ్గిందనే కామెంట్లు పెరిగాయి. ఇంకా రిలీజ్ కాని మూవీ ఫైరా ఫ్లవరా అప్పుడే తేల్చటం కష్టం. కాని ఎందుకో దేవర తాలూకు ప్రివ్యూ రికార్డుల్ని పుష్ప 2 ఈజీగా చెరిపేస్తుందన్నారు. కాని ఇంత భారీ హైప్ ఉన్నా దేవర యూఎస్ ప్రివ్యూ వసూళ్లను దాటడం కాదు, కనీసం రీచయ్యేలా సీన్ కనిపించట్లేదు. ఇండియాలో ఆల్రెడీ అడ్వాన్స్ బుక్కింగ్స్ తో 85 కోట్ల వసూళ్లు ఆల్రెడీ వచ్చేశాయి… కాని అమెరికాలో దేవర ముందు పుష్ప రాజ్ తగ్గినట్టే కనిపిస్తోంది.. ఇంతకి ఏం జరుగుతోంది…? అక్కడ ఎందుకు సీన్ రివర్స్ అవుతోంది?

దేవర మూవీ వచ్చి వండర్స చేసి నెలలు గడుస్తోంది. ఓటీటీలో కూడా దుమ్ముదులిపి నెలపైనే అవుతోంది. కాని ఇంకా ఈ సినిమా తాలూకు ఒక రికార్డు కొత్త మూవీపుష్ప2ని భయపెడుతూనే ఉంది. పుష్ప రాజ్ మీద మార్కెట్ లో ప్రీరిలీజ్ బిజినెస్ ఎంత బాగున్నా, అంతకుమించి నెగెటివిటీ కనిపిస్తోంది. దానికి కారణాలేవైనా, ప్రీరిలీజ్ బిజినెస్ లో పుష్పరాజ్ ఎంత దూకుడు మీదున్నా,యూఎస్ లో మాత్రం దేవుర రికార్డుని రీచ్ కాలేకపోతున్నాడు

దేవర మూవీ రిలీజ్ కి ఒకరోజు ముందు ప్రివ్యూకి 2.8 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే 22 కోట్లొచ్చినట్టే.. ఇక మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం 3.7 మిలియన్లు అంటే 30 కోట్లొచ్చాయి. మొత్తంగా 6.5 మిలియన్లు అంటే మన కరెన్సీలో 52 కోట్లు కేవలం యూఎస్ లోనే వచ్చాయి.

నిజానికి రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ మూవీ కూడా దుమ్ముదులిపింది. ప్రివ్యూకి 4 మిలియన్లు, ఫస్ట్ డే ఓపెనింగ్స్ 5.5 మిలియన్లు మొత్తంగా ఇండియన్ కరెన్సీలో 76 కోట్లు రాబట్టింది కల్కీ మూవీ.. సో దేవర, కల్కీ రెండూ కూడా ప్రివ్యూ, అలానే మొదటి రోజు ఓపెనింగ్స్ విషయంలో యూఎస్ ని కుదిపేశాయి.

కాని ఆరేంజ్ లో పుష్ప2 కి డాలర్ల వర్షం కష్టంగానే కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుక్కింగ్స్ పరంగా చూస్తే, పుష్ప2 ప్రివ్యూకి 1. 5 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. అంటే కనీసం రెండు మిలియన్లు కూడా రీచ్ అవటం కష్టంగానే కనిపిస్తోంది. అసలు బన్నీ అల వైకుంఠపురంలో మూవీ లైఫ్ టైం వసూల్లే యూఎస్ లో3.6 మిలియన్లు…
పుష్పకైతే ఆ పరిస్థితి కూడా లేదు. పుష్ప2 కి భారీగా హైప్ ఉన్నా యూఎస్ లో పెద్ద గా ఆ హైప్ రావట్లేదు… దానికి కారణం కూడా దొరకట్లేదు

పుష్ప కి పుష్ప2 కి చాలా డిఫరెన్స్ ఉంది. పుష్ప రాజ్ వచ్చేప్పుుడ అంతగా అంచనాలు లేవు. అది హిట్ అయ్యాక, సీక్వెల్ రూపంలో పుష్ప2 వస్తోంది.. కాబట్టే భారీగా హైప్ ఉండాలి.. కాని పేలని రెండు పాటలో, దేవి శ్రీ వివాదమో, కాదంటే మెగా ఫ్యాన్స్ వ్యతిరేకతో మొత్తానికి యూఎస్ లో మాత్రం పుష్ప వైల్డ్ ఫైర్ కాదు, మామూలు ఫైర్ గానే మిగిలేలా ఉన్నాడు.