దేవర జపాన్ లో అదుర్స్.. అందుకే దేవర 2 కథలో సునామీ…!

జపాన్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ జర్నీకి అదిరిపోయింది. ఊహించిన దానికంటే భారీగా అక్కడ జపాన్ ఫ్యాన్స్ హల్చల్ , నేషనల్ మీడియా వరకు పాకింది. ప్రివ్యూ అదిరింది. రివ్యూ అదిరింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 2, 2025 | 09:55 PMLast Updated on: Apr 02, 2025 | 9:55 PM

Godfather Is A Stranger In Japan Thats Why There Is A Tsunami In The Story Of Godfather 2

జపాన్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ జర్నీకి అదిరిపోయింది. ఊహించిన దానికంటే భారీగా అక్కడ జపాన్ ఫ్యాన్స్ హల్చల్ , నేషనల్ మీడియా వరకు పాకింది. ప్రివ్యూ అదిరింది. రివ్యూ అదిరింది.త్రీడేస్ కలెక్షన్స్ కూడా దుమ్ముదులిపాయంటున్నారు. కొరటాల శివ కూడా చాలా ఇంటర్వూస్ లో దేవర 2 గురించి చాలా వరకు అక్కడ హింట్స్ ఇచ్చాడు. ఇంతవరకు ఓకే, కాని ఇప్పుడే అసలు సమస్య వచ్చింది. ఎప్పుడో నెలక్రితమే దేవర 2 తాలూకు మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినా కొరటాల, మళ్లీ స్క్రిప్ట్ మీదే కూర్చోవాల్సి వస్తోంది. దేవర 2 కథ మొత్తం రెడీ అయ్యాక, ముంబై వెళ్లి వార్ 2 షూటింగ్ పూర్తయ్యే టైంలో ఎన్టీఆర్ కి వినిపించాడు కొరటాల శివ. దీంతో దేవర 2 స్క్రిప్ట్ లాక్ అయ్యిందన్నారు. కట్ చేస్తే దాన్ని మళ్లీ అన్ లాక్ చేయాల్సి వస్తోంది. అంతటికి జపాన్ లో దేవర 2 కి దుమ్మదుులిపేలా రెస్పాన్స్ రావటం. డ్రాగన్ లో కూడా కొన్ని కొత్త ఛేంజెస్ ఖాయంగా కనిపిస్తున్నాయి. అవేంటోచూసేయండి.

దేవర మూవీ జపాన్ లో దుమ్ముదులుపుతోంది. 550 నుంచి థియేటర్ల సంఖ్య 800 కి పెరిగింది. అంటే కేవలం 2 రోజుల్లో భారీ రెస్పాన్స్ రాగానే,మూడో రోజుకి 250 థియేటర్స్ అదనంగా యాడ్ అయ్యాయి. ఇక అక్కడే వారం రోజులు జపనీస్ ఫ్యాన్స్ మధ్య 20 సార్లు ఈ సినిమాను చూసిన తారక్ కి, అసలు జనాలకి ఏం నచ్చుతోందో అర్ధమైనట్టుంది.వెంటనే దేవర2 తాలూక స్క్రిప్ట్ లో మార్పులు కోన్ని సజెస్ట్ చేశాడట. ఆల్రెడీ దేవర 2 స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తైంది. ముంబైలో స్టోరీ నెరేషన్ ఇవ్వటం, తారక్ ఫైనల్ చేయటం కూడా జరిగి, ప్రీ ప్రొడక్షన్ పనుల్ని మొదలు పెట్టాడు కొరటాల శివ. కాని జపాన్ లో దేవర రెస్పాన్స్ అబ్జర్వ చేశాక, దేవర 2 లో ఫైట్లు, పాటలు, ఎమోషన్స్ సీన్స్ లో ఇంటెన్సిటీ పెంచే ఛాన్స్ ఉందట.

ఇవే అని ఖచ్చితంగా చెప్పలేకపోయినా, వాటికే జపాన్ ఫ్యాన్స్ ఎక్కువ రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. ఇక దేవర 2 లో ఖచ్చితంగా జపాన్ ఆర్టిస్ట్ ని ఎవరినైనా తీసుకుంటే ఎలా ఉంటుందనే డిస్కర్షన్ ఎన్టీఆర్, కొరటాల శివ మధ్య జరిగిందని తెలుస్తోంది. ఇది కొరటాల శివ వరకే పరిమితం కాలేదు. ప్రశాంత్ నీల్ వరకు ఈ డిస్కర్షన్ కొనసాగిందట. డ్రాగన్ లో కొరియన్, తో పాటు జపాన్ ఆర్టిస్టులు కూడా ఉన్నారని ఆల్రెడీ ప్రచారం జరుగుతోంది. అలాంటిది ఇప్పుడు జపాన్ తాలూకు ముగ్గురు ఆర్టిస్ట్ లని తారకే ప్రశాంత్ నీల్ కి సజెస్ట్ చేశాడని కొత్త ప్రచారం ఊపందుకుంది.

జపాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ని మెల్లిగా పెంచుకుంటూ వచ్చిన తారక్, అక్కడి మార్కెట్ కోసం తన సినిమాలో కంటెంట్ ని, ఆర్టిస్ట్ లని కూడా చూసీగా తీసుకుంటున్నాడట. ఈవిషయంలో ప్రశాంత్ నీల్ కూడా డ్రాగన్ కథలో కాదు కాని, ఫైట్లతో మార్పులకు సిధ్దమయ్యాడు. అందుకే డ్రాగన్ సాంగ్ షూటింగ్ ని వాయిదా వేసి, దాన్ని కూడా మార్చబోతున్నారట.