దేవర జపాన్ రచ్చ కిర్రాక్… ఇండియన్ ఫ్యాన్స్ అలక…

దేవర మూవీ జపాన్ ప్రమోషన్లు సెన్సేషన్ గా మారాయి. అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ లో ఎన్టీఆర్ ఇంటర్వూలు ఇచ్చేస్తున్నాడు. జపాన్ లో తనకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మీద అక్కడి మీడియా ఫోకస్ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2025 | 09:15 PMLast Updated on: Mar 26, 2025 | 9:15 PM

Gods Japan Is A Mess Indian Fans Are A Mess

దేవర మూవీ జపాన్ ప్రమోషన్లు సెన్సేషన్ గా మారాయి. అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ లో ఎన్టీఆర్ ఇంటర్వూలు ఇచ్చేస్తున్నాడు. జపాన్ లో తనకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మీద అక్కడి మీడియా ఫోకస్ చేసింది. ఇలా మరే తెలుగు హీరోకి జపాన్ లో ఈ రేంజ్ ఘన స్వాగతం దక్కలేదు. ప్రభాస్ కి కూడా అక్కడ మంచి ఫాలోయింగే ఉన్నా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చూసి, ఇక్కడ తన అభిమానులు షాక్ అవుతున్నారు. అంతవరకు బానే ఉంది కాని, ఎన్టీఆర్ తెలుగు ఫ్యాన్స్ లో అలకలు, సోసల్ మీడియా లో క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంత్రుప్తి కనిపిస్తోందన్న డిస్కర్షన్ షురూ అయ్యింది. అంతటికీ ఎన్టీఆర్ జపాన్ లో దేవరకి చేస్తున్న ప్రచారమే కారనం. అభిమాన హీరో తన హిట్ మూవీని జపాన్ లో ఇంత సీరియస్ గా ప్రమోట్ చేయటం, ఇక్కడి ఫ్యాన్స్ కూడా సంతోషించాల్సిన విషయమే.. వాళ్లకి కూడా నిజంగానే ఈ విషయంలో సంతోషమే కాని, అందుకు సమానంగా వాళ్ళలో అసంత్రుప్తి పెరగటానికి సాలిడ్ రీజనుంది? ఇంతకి వాళ్ల అలక దేనికి..? టేకేలుక్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర జపాన్ రిలీజ్ ఈ వీకెండే అవటంతో, అక్కడ ప్రమోషన్స్ పెంచాడు. యూ ట్యూబర్స్ కి ఇంటర్వూలు, థియేటర్స్ లోఫ్యాన్స్ తో కలిసి డాన్సులు, డిఫరెంట్ డిఫరెంట్ ఔట్ ఫిట్స్ తో ఫోటో షూట్లు.. మీడియా ముందు చిట్ చాట్లు.. అన్నీ అగ్రెసివ్ గా చేస్తున్నాడు. దూసుకెళుతున్నాడు.ఒక తెలుగు సినిమాకు జపాన్ లో ఇంతటి రెస్పాన్స్ అంటే గొప్ప విషయమే.. ఓ తెలుగు స్టార్ ఏకంగా రజినీ కాంత్, ప్రభాస్ ని మించేలా జపాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించటం షాకింగ్ న్యూస్. కాని ఈ విషయంలో త్రిబుల్ ఆర్ కంటే ముందే ఎప్పుడో యమదొంగ టైం నుంచే జపనీస్ అటెన్షన్ లాక్కుంటూ వచ్చాడు. తన ప్రతీ మూవీ పాటకు అక్కడి జనం యూ ట్యూబ్ లో కవరప్ సాంగ్స్ లో డాన్స్ చేయటం కూడా కామనైంది.

ఐతే ఇప్పుడు త్రిబుల్ ఆర్ మూవీ జపాన్ లోఏడాదికి పైగా ఆడాక, దేవరతో అక్కడి ఆడియన్స్ మీద దండెత్తాడు. జపాన్ లేడీ ఫ్యాన్స్ కి కూడా స్పెషల్ ట్రీట్ ఇస్తున్నాడు. ఓరకంగా తమ అభిమాన హీరోకి విదేశాల్లో, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే, తెలుగు ఫ్యాన్స్ తెగ సంబర పడాలి. పడుతున్నారు కూడా.. కాని వాళ్ల పులకరింతలో కొంతవరకు అసంత్రుప్తి కనిపిస్తోంది. ఎన్టీఆర్ రోజుకి 180 కి పైగా యూ ట్యూబ్ ఇంటర్వూలు, ఒకేసారి 200 యూ ట్యూబ్ ఛానల్స్ కి ఆడిటోరియంలో స్పెషల్ ఇంటర్వూలు ఇలా ఇస్తూ షాకిస్తున్నాడు. అక్కడి ఫ్యాన్స్ ఏకంగా ఆరు నుంచి ఏడు వరకు ప్రశ్నలు తనని అడగటం, తను సమాధానం చెప్పటమే కాదు, వాళ్ళడిగితే, స్టేజెక్కి డాన్స్ కూడా చేస్తున్నాడు..

ఆటో గ్రాఫులు, ఫోటో గ్రాఫులు మించి, ఏకంగా డైరెక్ట్ గా జపాన్ ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేయటం, ప్రశ్నలకు సమాధానం చెబుతూనే అవసరమైతే వాళ్లలతో కలిసి డాన్స్ చేయటం యూ ట్యూబ్ లో వైరలౌతోంది. అదే తెలుగు ఫ్యాన్స్ ని కాస్త డిసప్పాయింట్ చేస్తోంది. ఎందుకంటే ఇదే దేవర మూవీ రిలీజ్ కి ముందు ఈవెంట్ ప్లాన్ చేస్తే క్యాన్సెల్ అయ్యింది. ఇంతవరకెన్నడూ తారక్, తన ఫ్యాన్స్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ కాలేదు. జపాన్ లో ఫ్యాన్స్ కి మాత్రం వరాల మీద వరాలు ఇస్తున్నాడు. ఇదే ఎన్టీఆర్ తెలుగు ఫ్యాన్స్ ని కాస్త నిరుత్సాహపరుస్తోంది. కాని రియాలిటీ చెక్ చేస్తే, అప్పట్లో ఆంధ్రావాల ఈవెంట్ అంటే, అక్కడకి పది లక్షల పైగా జనం వచ్చారు. దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ అంటే 5 వేల మందిని ఎక్స్ పెక్ట్ చేస్తే 34 వేల మంది వచ్చారు. కాబట్టే ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. సో జపాన్ లో ఫ్యాన్స్ ఇంటరాక్షన్ లా ఇక్కడ అలానే చేయాలంటే లక్షల్లో జనాలతో మాట్లాడాలి… టెక్నికల్ గా అది సాధ్యం కాదు. ఇది ఫ్యాన్స్ కి కూడా తెలుసు.. అయినా జపాన్ ప్రమోషన్ ఈవెంట్స్ విషయంలో వాళ్ల డిసప్పాయింట్ మెంట్ ని సోషల్ మీడియాలో క్యూట్ గా నే తెలిసేలా చేస్తున్నారు.