ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హరిహర వీరమల్లు షూటింగ్ మొదలైంది.. మరి పవన్ వస్తాడా..?
పవన్ కళ్యాణ్ తో సినిమాలు అంటే గతుకుల రోడ్డు మీద అతుకులు వేసినట్టే ఉంటుంది. ఓ సినిమా మొదలుపెడతాడు.. కానీ పూర్తి మాత్రం చేయడు..

పవన్ కళ్యాణ్ తో సినిమాలు అంటే గతుకుల రోడ్డు మీద అతుకులు వేసినట్టే ఉంటుంది. ఓ సినిమా మొదలుపెడతాడు.. కానీ పూర్తి మాత్రం చేయడు.. మధ్య మధ్యలో ప్యాచ్ వర్క్ లు చేసుకుంటూ కూర్చుంటారు దర్శక నిర్మాతలు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు.. డేట్స్ ఎప్పుడు ఇస్తాడో క్లారిటీ ఉండదు.. వచ్చినప్పుడు షూట్ చేయడానికి రెడీగా ఉండాలి.. దానికి ముందు తర్వాత ఏం చేశారు అనేది అనవసరం.. పవన్ వచ్చినప్పుడు షూట్ చేసి దాన్ని సినిమాలకు తగ్గట్టు కనెక్ట్ చేసుకోవాలి.. ఇదంతా దర్శకుడు హెడేక్..! అన్నింటికీ సిద్ధం అయ్యే ఉన్నారు దర్శకులు.. పవన్ వచ్చేదే ఆలస్యం ఆయన మీద షూట్ చేయడానికి రెడీగా ఉన్నారు. తాజాగా హరిహర వీరమల్లు సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. మార్చి 28న సినిమా విడుదల అంటున్నారు ఇంకా షూటింగ్ చేస్తున్నారా అనే డౌట్ రావచ్చు.. ఈ సినిమా చెప్పిన టైంకు విడుదల కావడం అసాధ్యమే. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. అక్కడే ఎందుకు అంటే పవన్ కన్వీనియన్స్ కోసం.
ఆయన ఒకవేళ డేట్స్ ఇస్తాను అన్నా కూడా ఎక్కువ దూరం ట్రావెల్ చేసే టైం ఉండదు. అందుకే జనసేన పార్టీ ఆఫీసులో మంగళగిరి సమీప ప్రాంతాల్లోనే షూటింగ్ చేయాలి అంటూ దర్శక నిర్మాతలకు ఇప్పటికే కండిషన్ పెట్టాడు పవన్. ఈ క్రమంలోనే తాడేపల్లిలో హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ మొదలైంది. ప్రస్తుతం సత్యరాజ్, ఈశ్వరీ రావులపై కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు జ్యోతికృష్ణ. ఇదే షెడ్యూల్లో పవన్ కూడా పాల్గొంటాడు.. అలా అని దర్శక నిర్మాతలకు మాట కూడా ఇచ్చాడు జనసేనాని. కాకపోతే ఏపీలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. వీటి తర్వాత కానీ పవన్ కళ్యాణ్ వీరమల్లు షూటింగ్ లో పాల్గొనడం సాధ్యం కాదు. అప్పటివరకు వాళ్లకు వెయిటింగ్ తప్పదు. అయితే ఈ సినిమాలో పవన్ పోర్షన్ ఇంకా ఎంతో లేదు.. కేవలం నాలుగు రోజులు కేటాయిస్తే చాలు షూటింగ్ అయిపోతుంది.
అందుకే అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే షూటింగ్ లో జాయిన్ అవుతాను అని పవన్ చెప్పినట్టు తెలుస్తోంది. 16వ శతాబ్దం ఔరంగాజేబు నాటి కథతో హరిహర వీరమల్లు వస్తుంది. ఇందులో కోహినూర్ వజ్రం నేపథ్యమే ఎక్కువగా ఉంటుంది. రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ ఇందులో నటిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబి డియోల్ ఇందులో ఔరంగాజేబు పాత్రలో నటిస్తున్నాడు. సినిమా మీద ఎవరికి పెద్దగా అంచనాలైతే లేవు.. అలాగని పవన్ కళ్యాణ్ సినిమాను తక్కువ అంచనా వేస్తే అంతకంటే తెలివి తక్కువ పని మరొకటి ఉండదు. కాస్త తక్కువ ఓపెనింగ్స్ వస్తాయేమో గానీ.. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ బద్దలైపోతుంది. అదే జరగాలని కోరుకుంటున్నారు అభిమానులు. ఇదే సమ్మర్ లో సినిమా విడుదల కానుంది.