ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అప్పటి నుంచే
ఐకాన్ సార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. పుష్ప 2 సినిమా గ్రాండ్ విక్టరీ కొట్టడంతో బన్నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెడుతున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప సినిమాతో బన్నీకి ఇమేజ్ గ్రాండ్ గా వచ్చింది.
ఐకాన్ సార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. పుష్ప 2 సినిమా గ్రాండ్ విక్టరీ కొట్టడంతో బన్నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెడుతున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప సినిమాతో బన్నీకి ఇమేజ్ గ్రాండ్ గా వచ్చింది. ముఖ్యంగా నార్త్ లో అయితే పుష్ప సినిమాను చూసిన ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో కంటే నార్త్ ఇండియా లోనే బాగా ఆడింది అనే విషయం చాలామంది క్లారిటీ ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ కూడా భోజ్పురి హీరోల మాదిరిగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
పాన్ పరాగ్ నమిలే సీన్స్ అక్కడి ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చుతూ ఉంటాయి. ఆ సీన్స్ తో పాటు గన్ కల్చర్ ఉన్న సీన్స్ కూడా నార్త్ ఇండియన్స్ కు పిచ్చపిచ్చగా నచ్చుతాయి. అలాగే అల్లు అర్జున్ వేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా వాళ్లకు పిచ్చి ఎక్కించాయి. అందుకే అక్కడ వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఇప్పుడు పుష్ప 2 సినిమా హడావుడి తగ్గడంతో అల్లు అర్జున్ తర్వాత ఏం చేయాలనే దానిపై దృష్టి సారించాడు. బన్నీ కమిట్మెంట్ ప్రకారం తర్వాతి సినిమా మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయాల్సి ఉంది.
ఈ సినిమాకు సంబంధించి కథపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేకపోయినా జూన్ 2025లో ప్రారంభిస్తామని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ప్రకటించారు. ఒక వీడియో కట్ తో ఈ సినిమాను ప్రకటిస్తామని ఆయన ఓ ప్రెస్ మీట్ లో చెప్పిన విషయం బన్నీ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చింది. ఇప్పుడు చెప్పిన విధంగానే త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్లో సినిమాలో 2025 జనవరిలోనే స్టార్ట్ చేయనున్నారు. మూడేళ్లుగా అల్లు అర్జున్ పుష్ప సీరీస్ తో బిజీగా ఉండటంతో ఇప్పుడు కాస్త బ్రేక్ తీసుకుని ఆ తర్వాత జనవరి నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. దీనికి సంబంధించిన జానర్ ఏంటి అనేదానిపై క్లారిటీ లేదు.
త్రివిక్రమ్ కథ రెడీ చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారట. ఇప్పటికే త్రివిక్రమ్ కాంబినేషన్ లో అల్లు అర్జున్… జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి అలాగే అల వైకుంఠపురములో అనే సినిమాలు తీసి హ్యాట్రిక్ కొట్టాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను మైమరిపించేందుకు ఈ కాంబినేషన్ సిద్ధమవుతోంది. క్లాస్ ఆడియన్స్ కోసం సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా అంటే క్లాస్ ఆడియన్స్ కూడా పిచ్చెక్కిపోతూ ఉంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా దగ్గర చేసే విధంగా ఎమోషన్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటాడు త్రివిక్రమ్. గతంలో వచ్చిన జులాయి మాస్ సినిమా అయినా సరే క్లాస్ ఆడియన్స్ కు బాగా నచ్చింది. అలాగే సన్నాఫ్ సత్యమూర్తి పూర్తిగా క్లాస్ ఆడియన్స్ కు దగ్గర అయింది. అలవైకుంఠపురములో సినిమా కూడా మాస్ క్లాస్ ఆడియన్స్ ఇద్దరిని ఆకట్టుకుంది. ఇప్పుడు అదే రేంజ్ లో తర్వాత సినిమా ఉండవచ్చు అని టాక్ వస్తోంది.