Ustad Bhagathsingh : వన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉస్తాద్ నుంచి బిగ్ సర్ ప్రైజ్
పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagat Singh).

Good news for One fans.. Big surprise from Ustad
పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagat Singh). దీని నుంచి ఎలాంటి అప్డేట్ లేదు అనుకుంటున్న సమయంలో ఓ అప్డేట్ ఇవ్వనున్నట్లు గుడ్ న్యూస్ చెప్పింది ప్రొడక్షన్ హౌస్. దీంతో పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ప్రజెంట్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఎలక్షన్స్ అయిపోయే వరకు ఆయన సినిమాల నుంచి అప్ డేట్ రాదని అందరూ అనుకున్నారు. కానీ ఫ్యాన్స్‌కు ఊహించని గుడ్ న్యూస్ అందింది.
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ బ్లాస్ట్ రాబోతోందని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం నుంచి ఓ సాలిడ్ అప్డేడ్ వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానికి సంబంధించిన ఈ ఫోటోను కూడా విడుదల చేశారు. పవన్ కల్యాణ్ ఏదో వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. దాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్లు ఆ పిక్‌లో ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల (Srilila) నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ (Devishri Prasad) సంగీతం అందిస్తున్నారు. అయితే పవన్ రాజకీయాలతో బిజీ అయిపోవడం వలన, డైరెక్టర్ హరీష్, రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీంతో ఉస్తాద్ అప్‌డేట్‌లు పూర్తిగా ఆగిపోయాయి. ఇలాంటి సమయంలో ఈ సినిమా నుంచి మార్చి 19న అప్డేట్ వస్తుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఓ గ్లింప్స్ కూడా విడుదల అయింది. మీరీ ఈ సారి వచ్చి అప్డేట్ ఏమై ఉంటుందని ప్రేక్షకులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.