సెప్టెంబర్ 2… పవన్ ఫ్యాన్స్ కి బర్త్ డే గిఫ్ట్ రెడీ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గా బిజీ కావడంతో ఆయన సంతకం చేసిన సినిమాల సంగతి ఏంటీ అనే చర్చ మొదలయింది.

Power star Pawan Kalyan is a powerful action entertainer Ozzy. Sujeeth, who became a pan India director with Saaho, is directing this film.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గా బిజీ కావడంతో ఆయన సంతకం చేసిన సినిమాల సంగతి ఏంటీ అనే చర్చ మొదలయింది. సోషల్ మీడియాలో అయితే దీని గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. అటు ఫ్యాన్స్ కి ఇటు సినీ జనాలకు ఏ విధమైన క్లారిటీ రావడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల మీద ఫోకస్ చేసే అవకాశం ఉందనే వార్తలు వినపడుతున్నాయి. ఇటీవల ఆయన ఒప్పుకున్న సినిమాలకు సంబంధించిన నిర్మాతలు, దర్శకులు… ఆయన్ను కలుస్తున్నారు. తాజాగా మరో నిర్మాత కూడా పవన్ ను కలిసారు.
అమరావతిలో పవన్ కళ్యాణ్ ను కలిసిన ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. అలాగే ఇటీవల చెట్లు నరకడంపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై కూడా రవిశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అల్లు అర్జున్ గురించి గాని పుష్ప సినిమా గురించి గాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. ఇటీవలే పవన్ కల్యాణ్‌ను కలిశానని… త్వరలోనే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ ను ప్రారంభించనున్నామని తెలిపారు. డిసెంబర్, జనవరి నాటికి చిత్రీకరణను పూర్తిచేయాలని ప్లాన్ చేసుకున్నామని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్ 2 పవన్ పుట్టినరోజు సందర్భంగా మా టీమ్ నుంచి సర్‌ప్రైజ్ కచ్చితంగా ఉంటుంది అన్నారు ఆయన.
ఇక పవన్ వ్యాఖ్యల గురించి మాట్లాడిన ఆయన… చెట్ల నరికివేత, స్మగ్లింగ్ గురించి ఇటీవల పవన్ కల్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు ‘పుష్ప2’ను ఉద్దేశించినవి కాదని స్పష్టం చేసారు. పవన్ ఎప్పుడూ కావాలని అలా మాట్లాడరన్నారు రవి శంకర్. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనని అన్నారు రవి శంకర్. ‘పుష్ప-2’ సినిమా డిసెంబరు 6న కచ్చితంగా విడుదలవుతుందని ఆయన పేర్కొన్నారు. అటు ఓజీ సినిమా గురించి కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తైనా ఎప్పుడు విడుదల అవుతుందో క్లారిటీ రావడం లేదు.