సంక్రాంతికి పవర్ ఫ్యాన్స్ కు డబుల్ పండగ… బిగ్ ట్రీట్ రెడీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ డైరెక్షన్లో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. జాగర్లమూడి క్రిష్ డైరెక్షన్లో మొదలైన ఈ సినిమాను జ్యోతి కృష్ణ కంప్లిట్ చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ డైరెక్షన్లో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. జాగర్లమూడి క్రిష్ డైరెక్షన్లో మొదలైన ఈ సినిమాను జ్యోతి కృష్ణ కంప్లిట్ చేస్తున్నారు. రెండు పార్ట్ లుగా వస్తున్న ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఇంకో పది రోజులు మిగిలింది. మార్చి 28న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. పవన్ కళ్యాణ్ ఒకవైపున ఏపీ ప్రభుత్వంలో బిజీగా ఉన్నాను. అయినా ఈ సినిమా షూటింగ్ విషయంలో ఎక్కడా లేట్ చేయడం లేదు. ఐదేళ్ల క్రితం మొదలుపెట్టిన ఈ సినిమాను పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు.
ఇప్పుడు మాత్రం వాయిదా వేయొద్దని పట్టుదలగా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు ఇబ్బంది లేకుండా మంగళగిరి సమీపంలోనే ఒక సినిమా సెట్ కూడా ఏర్పాటు చేశారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమా కోసం ఎం ఎం కీరవాణి ఇప్పటికే మ్యూజిక్ కూడా ఫినిష్ చేసేసారు. ఇక ఈ సినిమాలో ఒక పాట షూటింగ్ చేయాల్సి ఉంది. బాబీ డియోల్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఇక మాట వినాలి అనే టైటిల్ తో ఒక సాంగ్ను ఈ నెల 6న రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను కూడా ఒప్పించారు. ఆయన చేతుల మీదుగా ఆ సాంగ్ ను రిలీజ్ చేయించే ప్లాన్ చేస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారట. అలాగే ఓజీ సినిమా నుంచి కూడా సంక్రాంతికి క్రేజీ అప్డేట్ రానుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా సరే ఆయన అభిమానులు ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా కాస్త డిసప్పాయింట్ అయ్యారు. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చి అభిమానులను కాస్త సైలెంట్ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట.
అందుకే డైరెక్టర్ సుజిత్ కూడా ఆ పని మీద ఉన్నట్టు తెలుస్తోంది. హరిహర వీరమల్లు ట్రైలర్ విషయంలో పవన్ కళ్యాణ్ ముందు ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈ సినిమా మొదలుపెట్టి ఇప్పటికే ఐదేళ్లు పూర్తయిన నేపద్యంలో ఇక అభిమానులను వెయిట్ చేయించుకోవద్దు అనే పట్టుదలగా ఉన్నారట. అందుకే త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచే ఆలోచన చేస్తున్నారు మేకర్స్. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటిసారి డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మంగళగిరి సమీపంలో జరుగుతున్నది. త్వరలోనే హైదరాబాదులో ఒక లొకేషన్ లో షూటింగ్ రెండు రోజులు ఫినిష్ చేయాల్సి ఉంది. దానికి కూడా పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారట.