గోపిచంద్ ను తీసుకో.. వంగాకు రిఫర్ చేసిన రెబల్ స్టార్

ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా సరే గోపీచంద్ మాత్రం సరైన సినిమా లేక కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ మధ్యకాలంలో అతను నటించిన ఏ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసినా సరే గోపీచంద్ కెరీర్ మాత్రం ముందుకు సక్సెస్ఫుల్ గా వెళ్లడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 15, 2025 | 01:35 PMLast Updated on: Feb 15, 2025 | 1:35 PM

Gopichand Is Facing Many Difficulties In Getting The Right Film

ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా సరే గోపీచంద్ మాత్రం సరైన సినిమా లేక కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ మధ్యకాలంలో అతను నటించిన ఏ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసినా సరే గోపీచంద్ కెరీర్ మాత్రం ముందుకు సక్సెస్ఫుల్ గా వెళ్లడం లేదు. ఒకప్పుడు విలన్ గా టాలీవుడ్ లో దుమ్మురేపిన గోపీచంద్ ఆ తర్వాత హీరోగా మారి కొన్ని హిట్లు కొట్టాడు. అయినా సరే కెరీర్ లో మాత్రం అతనికి సరైన సక్సెస్ లేదని చెప్పాలి. దాదాపు పది ఏళ్ల నుంచి అతను సరైన హిట్ కోసం కష్టపడుతూనే ఉన్నాడు.

ఇక ఇప్పుడు గోపీచంద్ మళ్లీ విలన్ గా మారే ప్రయత్నం చేస్తున్నాడు అనే ప్రచారం కూడా జరుగుతుంది. గోపీచంద్ విషయంలో ఓ స్టార్ డైరెక్టర్ పాజిటివ్ గా ఉన్నాడని, అతనికి విలన్ రోల్ ఇవ్వటానికి రెడీగా ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు అది నిజమే అన్నట్లు మరో న్యూస్ కూడా బయటకు వచ్చింది. స్టైలిష్ లుక్ లో ఎక్కువగా కనబడే గోపీచంద్ ఇప్పుడు ఓ స్టార్ హీరో సినిమాలో విలన్ ఆఫర్ కొట్టేసినట్లు ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఆ హీరో ఎవరో కాదు రెబల్ స్టార్ ప్రభాస్.

సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో గోపీచంద్ కు విలన్ రోల్ ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో విలన్ కోసం ముగ్గురు పేర్లను ఇప్పటికే పరిశీలించిన సందీప్ రెడ్డి వంగ.. రీసెంట్ గా మెగా హీరో వరుణ్ తేజ్ పేరును కూడా పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి ఒక న్యూస్ కూడా గట్టిగానే వైరల్ అయింది. అయితే సందీప్ రెడ్డి ఇప్పుడు గోపీచంద్ విషయంలో పాజిటివ్ గా ఉన్నాడని, ప్రభాస్ రిఫర్ చేశాడని అంటున్నారు. విలన్ గా ఈ సినిమా నుంచి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని గోపీచంద్ టార్గెట్ పెట్టుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ఇప్పటివరకు హీరోగా ప్రయత్నాలు చేసిన గోపీచంద్ ఇప్పుడు మాత్రం ఇక హీరో పాత్రలకు కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చి.. విలన్ గా బిజీ అవ్వాలని వర్కౌట్ మొదలుపెట్టాడు. సందీప్ రెడ్డి వంగ కూడా ఇప్పటికే గోపీచంద్ కు లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నెక్స్ట్ ఇయర్ జూన్ లో రిలీజ్ చేయాలని సందీప్ రెడ్డి టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాడు. ఇందుకోసం ఇప్పటికే యాక్టర్స్ ను కూడా ఆల్మోస్ట్ ఫైనల్ చేశారు. ముందు సౌత్ కొరియా విలన్ ను ఈ సినిమాలో తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ప్రభాస్ రిఫర్ చేయడంతో గోపీచంద్ ను ఈ సినిమాలో విలన్ గా ఫైనల్ చేసినట్లు టాక్. త్వరలోనే సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ సినిమాతో బిజీగా ఉన్నాడు.