Bhimaa Review: మాస్ జాతర.. భీమా ఫ్యాన్స్కు ఫుల్ మిల్స్
భీమా'లో దర్శకుడు ఎ హర్ష తీసుకున్న పాయింట్ కొత్తగా ఉంది. పవర్ ఫుల్ స్టోరీ రాసుకున్నప్పటికి అక్కడక్కడ సో.. సో.. సీన్లతో నింపేశాడు చివరి 30 నిమిషాల్లో కొత్త అనుభూతిని కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. మాస్ ఆడియన్స్‌ను మెప్పించే చిత్రమిది.
Bhimaa Review: మహాశివరాత్రి కానుకగా గోపిచంద్ నటించిన భీమా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ ట్రైలర్ తోనే అంచనాలు పెంచిన ఈ మూవీ థియేటర్ లో ఎలాంటి రచ్చ చేస్తోందో తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే.
ROJA DEFEAT : రోజాపై తిరుగుబాటు ! నగరిలో వాళ్ళంతా వ్యతిరేకమే..
కథ విషయానికి వస్తే.. మహేంద్రగిరిలో భవాని అయిన ముఖేష్ తివారి కి తిరుగులేదు. ఆయనకు ఎదురు తిరిగితే పోలీస్ అధికారుల్ని అయినా సరే చంపేస్తారు. చెక్ పోస్ట్ దగ్గర ట్యాంకర్ల జోలికి ఎవరొచ్చినా ఊరుకోడు. ఎస్సై గా వచ్చిన కమల్ కామరాజు ను చంపేస్తాడు. ఆ తర్వాత భీమా అయిన గోపీచంద్ ఎస్సైగా అక్కడి వస్తాడు. వచ్చీ రావడంతో భవానీకి వార్నింగ్ ఇస్తాడు. భవాని మనుషుల్ని టార్గెట్ చేస్తాడు. ఆఖరికి చెక్ పోస్ట్ దగ్గర ట్యాంకర్ల దగ్గరకు వస్తాడు. భవాని ట్యాంకర్లలో రహస్యం ఏమిటి.. ప్రకృతి వైద్యుడు రవీంద్ర వర్మ అయిన నాజర్ ఏం చేశాడు.. విద్య అయిన మాళవికా శర్మ వల్ల భీమా జీవితంలో ఏం జరిగింది. అసలు మహేంద్రగిరిలోని పరశురామ క్షేత్రం ఐదు దశాబ్దాలుగా మూత పడటానికి కారణమేంటి.. భీమా మహేంద్రగిరిలో దించడంతో ఏం జరిగిందన్నదే మిగతా అసలు కథ.
పర్పామెన్స్ విషయానికి వస్తే.. గోపిచంద్ పర్పామెన్స్‌తో అదరగొట్టాడు. రెండు లుక్స్‌లో వావ్ అనిపించాడు. పోలీస్ పాత్రలో మీసకట్టు, రామాగా పొడవాటి జుట్టుతో డిఫరెన్స్ చూపించాడు. నటనలో ఎప్పటిలా 100 పర్సెంట్ ఇచ్చారు. హీరోయిన్లలో మాళవికా శర్మకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. మాస్ ఆడియన్స్ కోసం గ్లామరస్‌గా కనిపించారు. ముఖేష్ తివారి విలన్‌గా మెప్పించాడు. బాహుబలి’లో బిజ్జలదేవ టైపులో బాడీ లాంగ్వేజ్ మైంటైన్ చేశారు. నాజర్, రఘుబాబు, ‘వెన్నెల’ కిశోర్, సీనియర్ నరేష్, సప్తగిరి, ‘చమ్మక్’ చంద్ర, సరయు పర్వాలేదనిపించారు
టెక్నికల్ విభాగం..
భీమా’లో దర్శకుడు ఎ హర్ష తీసుకున్న పాయింట్ కొత్తగా ఉంది. పవర్ ఫుల్ స్టోరీ రాసుకున్నప్పటికి అక్కడక్కడ సో.. సో.. సీన్లతో నింపేశాడు చివరి 30 నిమిషాల్లో కొత్త అనుభూతిని కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ మాస్ సినిమాకు కావాల్సిన మూడ్ స్క్రీన్ మీద చూపించింది. నిర్మాత కెకె రాధామోహన్ ఖర్చుకు వెనకాడలేదు. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపించింది. రవి బస్రూర్ పాటల కంటే నేపథ్య సంగీతం ‘భీమా’ చిత్రానికి బలంగా నిలిచింది. యాక్షన్ సీన్లకు చేసిన రీ రికార్డింగ్ బావుంది. ఓవరాల్‌గా ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే గోపీచంద్ నటన, క్లైమాక్స్, యాక్షన్ సీన్లు నచ్చుతాయి. మాస్ ఆడియన్స్‌ను మెప్పించే చిత్రమిది.