RC 16 : గ్రాండ్‌గా RC 16 ఓపెనింగ్.. గెస్ట్‌గా స్టార్ హీరో

గేమ్ చేంజర్ (Game Changer) సినిమాకు షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. వైజాగ్‌ (Vizag) లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సీన్స్ తెరకెక్కిస్తున్నాడు శంకర్. రామ్ చరణ్, కియారా అద్వానీలతో పాటు షూటింగ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 20, 2024 | 10:58 AMLast Updated on: Mar 20, 2024 | 10:58 AM

Grand Opening Of Rc 16 Star Hero As Guest

గేమ్ చేంజర్ (Game Changer) సినిమాకు షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. వైజాగ్‌ (Vizag) లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సీన్స్ తెరకెక్కిస్తున్నాడు శంకర్. రామ్ చరణ్, కియారా అద్వానీలతో పాటు షూటింగ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గేమ్ చేంజర్ నుంచి మార్చి 27న చరణ్ బర్త్ డే సందర్భంగా సాలిడ్ కంటెంట్ బయటికి రాబోతోంది. చరణ్ బర్త్ (Charan’s Birthday) డే ట్రీట్‌గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే కన్ఫర్మ్ చేసేశాడు తమన్. ఇక ఈ సినిమా తర్వాత ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు చరణ్.

ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశాడు. ఉప్పెన తర్వాత చాలా కాలం వెయిట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు.. ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకున్నాడు. కానీ ఫైనల్‌గా ఈ ప్రాజెక్ట్ చరణ్ దగ్గరికి వచ్చి ఆగింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్న బుచ్చిబాబు.. ఇప్పుడు గ్రాండ్ ఓపెనింగ్‌కు రెడీ అయ్యాడు. రామ్ చరణ్ పుట్టినరోజుకి ఒక వారం ముందే ఆర్సీ 16ని గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే సర్వం సిద్ధం అయ్యినట్టుగా తెలుస్తుంది. మార్చ్ 20న హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో లాంఛనంగా ఆరంభం కానుంది.
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అలాగే.. చరణ్ బర్త్ డేకి ఆర్సీ 16 ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ మరియు మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఆర్సీ 16ని నిర్మిస్తోంది.