Varun Tej-Lavanya Reception : ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి రిసెప్షన్..హాజరైన ప్రముఖులు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, స్టార్ బ్యూటీ లావణ్య త్రిపాఠిల పెళ్లి నవంబర్ 1న ఇటలీ లో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా కుటుంబ సభ్యులతో పాటు అల్లు కుటుంబ సభ్యులకు కూడా ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Grand Varun Tej-Lavanya Tripathi reception..celebrities present
మెగా ఇంటికి తార లోకం..
మెగా ప్రిన్స్ (Mega Prince) వరుణ్ తేజ్, స్టార్ బ్యూటీ లావణ్య త్రిపాఠిల ( Lavanya Tripathi) పెళ్లి నవంబర్ 1న ఇటలీ లో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా కుటుంబ సభ్యులతో పాటు అల్లు కుటుంబ సభ్యులకు కూడా ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా జంట తిరిగి హైదరాబాద్ వచ్చాక టాలీవుడ్ సెలబ్రిటీలకు మెగా కుటుంబం ఒక పెద్ద రిసెప్షన్ అరేంజ్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,లావణ్యత్రిపాఠి రిసెప్షన్ (Varun-Lavanya Reception) హైదరాబాద్‌లోని ఎన్. కన్వెషన్ మాదాపూర్‌లో ఘనంగా జరిగింది. వరుణ్-లావణ్యల కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక కోలాహలంగా జరిగింది. సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై.. కొత్త దంపతులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. టాలీవుడ్ తారల రాకతో రిసెప్షన్ కార్యక్రమం కళకళలాడింది.
మరోవైపు వరుణ్ – లావణ్యల పెళ్లి, రిసెప్షన్ సందర్భంగా అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి , అల్లు అరవింద్, ఇతర కుటుంబ సభ్యులతో పాటు అలీ, మురళీమోహన్ః, వెంకటేశ్,నాగచైతన్య, దగ్గుబాటి పురందేశ్వరి, కామినేని శ్రీనివాస్, టి.సుబ్బరామిరెడ్డి, జయసుధ,సుకుమార్, యాంకర్ సుమ, బ్యాడ్మింటన్ తార సైనా నెహ్వాల్ తదితర ప్రముఖులు విచ్చేశారు. హీరోల విషయానికి వస్తే.. వెంకటేష్, నాగ చైతన్య, రోషన్ మేక, జయసుధ, సందీప్ కిషన్, అడివి శేష్, రాజేంద్ర ప్రసాద్, రీతూ వర్మ, సుశాంత్, జగపతి బాబు, కార్తికేయ, అలీ, సునీల్, మురళీ మోహన్, ఉత్తేజ్, సుబ్బరాజు, ప్రియదర్శి, నవదీప్, అభినవ్ గోమతం, ప్రిన్స్, ఈ కార్యక్రమంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్, ఆశిష్ రెడ్డి, తేజ సజ్జ, సత్యదేవ్, నవీన్ చంద్ర తదితరులు పాల్గొని సందడి చేశారు.