GUNTUR KAARAM: సూపర్ స్టార్ మహేశ్‌ను ముంచిన త్రివిక్రమ్..
అల వైకుంఠపురంలో, అరవింద సమేత వీరరాఘవలో కంటెంట్ ఉన్నంత బలంగా గుంటూరు కారంలో కంటెట్ లేదనాల్సి వస్తోంది. ఏదో నిద్రమద్దులో స్క్రిప్ట్ మమ అనేశారనే సెటైర్లు పేలుతున్నాయి.

GUNTUR KAARAM: దర్శకుడిని నమ్మిన మహేశ్ బాబు కంట్లో గుంటూరు కారం నిజంగా కారం కొట్టేస్తోంది. ఫ్యాన్స్ కూడా మొదట్నుంచి గురూజీ పనితనం మీద డౌట్లని కామెంట్ల రూపంలో విసిరారు. అనుకున్నదే అయ్యింది. అనుకున్నట్టే అయ్యింది. గుంటూరు కారం పాటల్లో పదాలు ఎంత నాసిరకంగా ఉన్నాయో.. మూవీలో కంటెంట్ అంతే నాసిరకంగా ఉందనేస్తున్నారు. అల వైకుంఠపురంలో, అరవింద సమేత వీరరాఘవలో కంటెంట్ ఉన్నంత బలంగా గుంటూరు కారంలో కంటెట్ లేదనాల్సి వస్తోంది.
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి రండి.. రాంచరణ్‌కు ఆహ్వానం..
ఏదో నిద్రమద్దులో స్క్రిప్ట్ మమ అనేశారనే సెటైర్లు పేలుతున్నాయి. అల వైకుంఠపురంలో, అరవింద సమేత కూడా గుంటూరు కారం మూవీలానే కాపీ కథ అనే కామెంట్లున్నాయి. కాని అవి కాస్త బెటర్‌గా ఉన్నాయి. కానీ, గుంటూరు కారం.. విషయంలేని కథతో నింపారనే కామెంట్స్ ఫేస్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్, ఓజీ కోసం సుజిత్‌కి పవన్ డేట్లు ఇప్పించటం, ఇలా పవన్ సినిమాల పనులకోసం కేటాయించే సమయంలో సగం ఇక్కడ కేటాయించినా కథ పూర్తయ్యేదని అప్పట్లోనే కామెంట్లొచ్చాయి. అలా నాసి రకం కథ ఇస్తే నచ్చకే.. మహేశ్ ఆ కథని ఆపి మరో కథని రాయించాడు.
అది కూడా ఇంత నాసిరకంగా ఉంటే తను మాత్రం ఏం చేస్తాడు..? సర్కారు వారిపాట కథ విషయంలో కూడా పరశురామ్‌కి క్లారిటీ లేక మహేశ్ బాబుకి పంచ్ ఇచ్చాడు. గుంటూరు కారం విషయంలో త్రివిక్రమ్ అలానే ముంచాడు. ఇది సోషల్ మీడియాలో సగటు ఫ్యాన్స్ ఆవేదన. డైరెక్టర్స్ హీరోగా వాళ్లనే నమ్మితే ఇంతగా ముంచేస్తారా..? ఇంకో డైరెక్టర్‌ని మహేశ్ ఇక మీదట బ్లైండ్‌గా నమ్మేయగలడా..? డౌటే..!