GUNTUR KAARAM REVIEW: ‘గుంటూరు కారం’ ఎలా ఉంది..? ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..
గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. దుబాయ్ సెన్సార్ సభ్యుడు ఉమైర్ సందు 'గుంటూరు కారం' సినిమా ఫస్ట్ రివ్యూను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబును కొత్తగా చూస్తారని ఉమైర్ సంధు రాసుకొచ్చాడు.

Superstar Mahesh Babu raised dust.. Chairs beware..
GUNTUR KAARAM REVIEW: సంక్రాంతి సినిమాల్లో మేజర్ షేర్ గుంటూరు కారం మూవీదే. అక్కడున్నది మహేష్ బాబు కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. పైగా త్రివిక్రమ్ కూడా తోడున్నాడు కాబట్టి ఇంక తగ్గేదేలే అన్నట్లుంది పరిస్థితి. ఈ సినిమాతో బాక్సాఫీస్ వేడెక్కడం ఖాయమనే సంకేతాలు ఇప్పటికే వెళ్లిపోయాయి. పైగా పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఫైట్లు అలా ఉంది.. డాన్సులు ఇలా ఉన్నాయి.. మాస్ సీన్స్ అదిరిపోతాయంటూ ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు.
HANUMAN REVIEW: ఊహించని టాక్.. ‘హనుమాన్’ ఫస్ట్ రివ్యూ
దీంతో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. దుబాయ్ సెన్సార్ సభ్యుడు ఉమైర్ సందు ‘గుంటూరు కారం’ సినిమా ఫస్ట్ రివ్యూను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబును కొత్తగా చూస్తారని ఉమైర్ సంధు రాసుకొచ్చాడు. పంచ్ డైలాగ్స్, యాక్షన్‌తో మహేష్ ఈ సినిమాలో అదరగొట్టేశాడని చెప్పుకొచ్చాడు. మహేష్ బాబును కొన్నేళ్లుగా ఎలాగైతే చూడాలని ఫ్యాన్స్ కలలు కంటున్నారో.. అలాగే త్రివిక్రమ్ చూపించాడంటున్నారు. మాస్ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు గుంటూరు కారంలో పుష్కలంగా ఉన్నాయన్నారు. మరోవైపు ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ సినిమాకు హైలైట్ అవుతాయని.. దాంతో పాటు యాక్షన్ సీన్స్.. సూపర్ స్టార్ కృష్ణ రిఫెరెన్స్.. మిర్చి యార్డ్‌లో శ్రీలీల, మహేష్ బాబు వేసిన డాన్సులు ఇవన్నీ మేజర్ హైలైట్స్ అంటున్నారు.
మరోవైపు సెకండాఫ్‌లోనూ యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని.. రమ్యకృష్ణ, మహేష్ బాబు మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా బాగా వర్కవుట్ అవుతాయంటున్నారు. మొత్తానికి సంక్రాంతికి రమణగాడిదే రుబాబు అని చెప్పేయడంతో ఫ్యాన్స్ ఫూనకాలతో ఊగిపోతున్నారు.