GUNTUR KAARAM: గుంటూరు కారం.. నార్త్‌లో మాస్ రెస్పాన్స్..!

ఓటీటీలో మాత్రం గుంటూరు కారం ఘాటుకి మతిపోతున్నట్టుంది. నార్త్ ఇండియన్స్ మాత్రం ఈసినిమా హిందీవర్షన్‌కి ఫిదా అయ్యారు. నెట్ ఫ్లిక్స్‌లో దుమ్ముదులుపుతున్న టాప్ టెన్ మూవీస్‌లో గుంటూరు కారం మూడో స్థానంలో ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2024 | 06:30 PMLast Updated on: Feb 21, 2024 | 6:32 PM

Guntur Kaaram Hindi Movie In Trending In Netflix Ott

GUNTUR KAARAM: గుంటూరు కారం బాలేదన్నారు. మహేశ్ నటన, డాన్స్ ఇరగదీస్తే, త్రివిక్రమ్ కథని చంపేశాడన్నారు. మాటల మాంత్రికుడి పనితనం వల్లే అంతగొప్పగా మహేశ్ పెర్ఫామ్ చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. వసూళ్లు కూడా రూ.180 కోట్ల వరకొచ్చినా, అవన్నీ గ్రాస్ కలెక్షన్స్ అవటంతో, డిస్ట్రిబ్యూటర్లకు కూడా పెద్దగా ఒరిగిందేంలేదట. చివరకు చాలావరకు నష్టాల్నే మిగిల్చింది ఈ సినిమా.

PRABHAS: కల్కి, రాజాసాబ్.. ఇద్దరూ డాన్స్ చేయాల్సిందే..

ఏదేమైనా గుంటూరు కారం థియేటర్స్‌లో ఘాటు లేదన్నారు. కానీ, ఓటీటీలో మాత్రం గుంటూరు కారం ఘాటుకి మతిపోతున్నట్టుంది. నార్త్ ఇండియన్స్ మాత్రం ఈసినిమా హిందీవర్షన్‌కి ఫిదా అయ్యారు. నెట్ ఫ్లిక్స్‌లో దుమ్ముదులుపుతున్న టాప్ టెన్ మూవీస్‌లో గుంటూరు కారం మూడో స్థానంలో ఉంది. విచిత్రం ఏంటంటే నాలుగో స్తానంలోకూడా గుంటూరు కారమే ఉంది. మూడో స్థానంలో గుంటూరు కారం హిందీ వర్షన్ ఉంటే, నాలుగో స్తానంలో గుంటూరు కారం తెలుగు వర్షన్ ఉంది.

ఇక మొదటి రెండు స్థానాల్లో మాత్రం యానిమల్ మూవీ, సలార్ ఉన్నాయి. వీటి తర్వాతీ ప్లేస్‌లో ఓటీటీని కుదిపేస్తోంది గుంటూరు కారం మూవీ. తెలుగు వాళ్లు అంతగా ఆదరించకపోయినా.. ఉత్తరాది ప్రేక్షకులు మాత్రం ఓటీటీలో ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.