Kurchi Madathapetti: గ్లోబల్ రీచ్‌తో ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్.. మాసివ్ రికార్డ్
విమర్శల మధ్య లిరికల్ వీడియో రిలీజ్ అయింది. అందరూ ఊహించిన దానికి భిన్నంగా ఆ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ పాట వల్ల సినిమాకి కూడా బాగా హైప్ వచ్చింది. ఇక సినిమాలో కూడా ఈ పాటలో మహేష్, శ్రీలీల వేసిన స్టెప్స్‌కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
Kurchi Madathapetti: ఇటీవలి కాలంలో కొన్ని సినిమాల్లోని పాటలు సెన్సేషన్ క్రియేట్ చేస్తూ రిలీజ్‌కి ముందే ఆయా సినిమాలకు మంచి హైప్ తీసుకొస్తున్నాయి. 2017లో ‘ఫిదా’లోని ‘వచ్చిండే.. మెల్లా మెల్లగ వచ్చిండే..’ అనే పాటతో స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. ఈ ఏడు సంవత్సరాల్లో ఎన్నో పాటలు బాగా ట్రెండ్ అవుతూ కొత్త రికార్డులు సృషించాయి. ఈ పాటలతో చేసే రీల్స్ కూడా విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు ఆ వరసలో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషనననలో రూపొందిన ‘గుంటూరు కారం’ చిత్రంలోని ‘ఆ కుర్చీని మడతపెట్టి..’ సాంగ్ కూడా చేరింది.
Pushpa2: పుష్ప-2లో మరో స్టార్.. సుకుమార్ ఏం ప్లానింగయ్యా సామీ..!
‘గుంటూరు కారం’ చిత్రంలో ‘ఆ కుర్చీని మడత పెట్టి..’ అనే సాంగ్‌ను పెట్టబోతున్నారన్న వార్త రాగానే మొదట విపరీతమైన నెగిటివ్ రెసాన్స్ వచ్చింది. ఒక స్టార్ హీరో సినిమాలో అలాంటి పాట పెట్డడం ఏమిటి? అని, ఆ పాట మహేష్ ఇమేజ్ దెబ్బతీసేలా ఉందని, సినిమాకు అదే మైనస్ అవుతుందని.. ఇలా రకరకాల కామెంట్స్ వచ్చాయి. ఈ విషయంలో తమన్‌ను బాగా ట్రోల్ చేసారు. ఇన్ని విమర్శల మధ్య లిరికల్ వీడియో రిలీజ్ అయింది. అందరూ ఊహించిన దానికి భిన్నంగా ఆ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ పాట వల్ల సినిమాకి కూడా బాగా హైప్ వచ్చింది. ఇక సినిమాలో కూడా ఈ పాటలో మహేష్, శ్రీలీల వేసిన స్టెప్స్‌కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే ఈ పాట పూర్తి వీడియోను కూడా రిలీజ్ చేశారు. మేకర్స్. ఈ వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ పాట 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి టాలీవుడ్‌లోనే కాదు, సౌత్ ఇండియా సినిమా చరిత్రలోనే 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన పాటల్లో ఒకటిగా నిలిచింది ‘ఆ కుర్చీని మడతపెట్టి..’ సాంగ్.
అంతే కాదు, 1 మిలియన్ లైక్స్ కూడా సాధించి మరో రికార్డు క్రియేట్ చేసింది. త్రివిక్రమ్, థమన్ కాంబినేషన్‌లో ఆమధ్య వచ్చిన ‘అల వైకుంఠపురములో..’ చిత్రంలోని పాటలు ఒక ఊపు ఊపాయి. ఆ సినిమాలోని పాటలకు దేశ, విదేశాల్లోనూ మంచి పాపులారిటీ వచ్చింది. కొన్ని వేల రీల్స్ రూపొందించి ఆ పాటలకు మరింత క్రేజ్ తీసుకొచ్చారు నెటిజన్లు. ఇప్పుడు ‘ఆ కుర్చీని మడతపెట్టి..’ సాంగ్‌తో మరోసారి ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు త్రివిక్రమ్, థమన్. ఈమధ్యకాలంలో ఈ పాటకు చేసినన్నీ రీల్స్ ఏ పాటకూ చేయలేదంటే అతిశయోక్తి కాదు, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చేసిన రీల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగి పోతున్నాయి.