GUNTUR KAARAM: ప్రి రిలీజ్ ఈవెంట్ల తలరాత మార్చేసిన పవన్ కళ్యాణ్
హాలీడే కాకుండా వర్కింగ్ డే ఈవెంట్లంటే జనాలకు రీచ్ తక్కువ. ఇబ్బందులు ఎక్కువ. అందుకే తప్పనిసరి అయినా.. ఆదివారానికి గుంటూరు కారం ప్రి రిలీజ్ ఈవెంట్ మార్చామన్నారు. కానీ, ఆదివారం రోజే హనుమాన్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది.

GUNTUR KAARAM: గుంటూరు కారం మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ శనివారమే జరగాలి. కానీ, వేదిక విషయంలో పర్మిషన్ రాలేదనే కారణంతో వాయిదా వేశారు. అసలు వాస్తవం వేరే ఉంది. చీఫ్ గెస్ట్‌గా రావాల్సిన పవన్ కళ్యాణ్‌కి శనివారం కుదరకపోవటమే అంటున్నారు. దీంతో సోమవారం నాటికి ప్రి రిలీజ్ ఈవెంట్ వాయిదా వేశారు. ఈ లెక్కన సోమవారం ప్రి రిలీజ్ ఈవెంట్ జరగాలి. అయితే, ఆరోజు వర్కింగ్ డే. హాలీడే కాకుండా వర్కింగ్ డే ఈవెంట్లంటే జనాలకు రీచ్ తక్కువ.
Guntur Karam : బాబు ఈజ్ బ్యాక్.. ఇక ‘గుంటూరు కారం’ మాస్ జాతరే..!
ఇబ్బందులు ఎక్కువ. అందుకే తప్పనిసరి అయినా.. ఆదివారానికి గుంటూరు కారం ప్రి రిలీజ్ ఈవెంట్ మార్చామన్నారు. కానీ, ఆదివారం రోజే హనుమాన్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది. సరే దాంతో గుంటూరు కారం మూవీకి ఏంటి సంబంధం అంటే, యూట్యూబ్ లైవే రీజన్. ఒకే రోజు.. ఒకేసారి రెండు సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్లంటే, యూ ట్యూబ్ లైవ్‌లో జనం ఏ ఈవెంట్ ఫాలో అవుతారు అనేది మరో సమస్య. ఎందుకంటే.. శాటిలైట్ చానల్ అందుబాటులో లేని ఎన్నారైలకు, వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్లకి యూ ట్యూబ్ లైవే దిక్కు. కాబట్టి దాన్ని అంత లైట్ తీసుకోలేరు. అందుకే హనుమాన్, సైంధవ్, గుంటూరు కారం సినిమాల ప్రి రిలీజ్ ఈవెంట్లు ఆదివారం రోజే జరిగినా, వేరు వేరు సమయాల్లో జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారట.